others

Biggboss: రోజురోజుకూ దారుణంగా తయారవుతున్న రీతూ చౌదరి..

ప్రస్తుతం కాంట్రవర్సీ ఎవరైనా ఉన్నారంటే రీతూ చౌదరి. ఆమెకు బయట ప్రేక్షకులు పెట్టిన ముద్దుపేరు రాధిక అక్క. తన గేమ్ చెడగొట్టుకోవడమే కాకుండా మరో ఇద్దరి గేమ్ చెడగొట్టేందుకు శతవిధాలుగా యత్నిస్తోంది

Biggboss: రోజురోజుకూ దారుణంగా తయారవుతున్న రీతూ చౌదరి..

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) ఇప్పుడిప్పుడు పర్వాలేదనిపిస్తోంది. బిగ్‌బాస్ (Biggboss) నిర్వాహకులు సైతం ఇంట్రస్టింగ్‌గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లో ప్రస్తుతం కాంట్రవర్సీ ఎవరైనా ఉన్నారంటే రీతూ చౌదరి (Rithu Chowdary). ఆమెకు బయట ప్రేక్షకులు పెట్టిన ముద్దుపేరు రాధిక అక్క. తన గేమ్ చెడగొట్టుకోవడమే కాకుండా మరో ఇద్దరి గేమ్ చెడగొట్టేందుకు శతవిధాలుగా యత్నిస్తోంది. ఆ ఇద్దరూ ఎవరనేది బిగ్‌బాస్ చూసేవారెవరికైనా తెలుస్తుంది. ఒకరు పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. మరొకరు డెమాన్ పవన్ (Demon Pawan). వాస్తవానికి ఈమె కారణంగా డెమాన్ పవన్ ఆట అయితే పూర్తిగా పోతోంది. కెప్టెన్సీ గేమ్‌లో సంచాలక్‌గా ఉండి రీతూ చౌదరి ఎంత రచ్చ చేసిందో తెలిసిందే. దీంతో ఇక రీతూ చౌదరి తగ్గుతుందని.. ఇక మీదట బాగుంటుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె తీరు మారేలా కనిపించడమే లేదు.

నిన్న బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా కామనర్స్‌కు ఐదుగురిని నామినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పారు. వారిలో ఒక కామనర్ ఉండాలని చెప్పారు. నలుగురు సెలబ్రిటీలను కామనర్ వచ్చేసి హరిత హరీష్‌ (Haritha Harish)ను నామినేషన్‌లో పెట్టారు. ఆ తరువాత సెలబ్రిటీలకు కామనర్స్.. నామినేషన్‌ (Biggboss Naminations)లో పెట్టిన వారితో ఇద్దరిని మార్చవచ్చని చెప్పారు. అప్పుడు సెలబ్రిటీలు (Celebrities) ఇద్దరిని మార్చేసి ఇద్దరి ప్లేస్‌లో ఇద్దరు కామనర్స్‌ని పెట్టారు. మొత్తానికి నామినేషన్స్‌లో ఉన్నవారిలో రీతూ చౌదరి కూడా ఉంది. ఆమె కెప్టెన్సీ టాస్క్‌ (Captaincy Task)లో ఒకరికి ఫేవర్‌గా ఉండటం వలన తామంతా ఇబ్బంది పడ్డామనేది వారి వాదన. దానికి ఆమె కూడా నేను ఈ నామినేషన్ తీసుకుంటా.. నేను స్ట్రాంగ్‌గా నామినేషన్స్ నుంచి బయటకు వస్తా అని చెప్పింది. ఆ తరువాత ఫైనల్‌గా కెప్టెన్‌గా ఉన్న డెమాన్ పవన్‌కు ఒకరిని తన అధికారాన్ని వినియోగించి సేవ్ చేసే బాధ్యతను బిగ్‌బాస్ అప్పగించారు.

డెమాన్ పవన్ వచ్చేసి శ్రీజ (Srija)ను సేవ్ చేశాడు. దీనికి రీతూకి హార్ట్ బ్రేక్ అయ్యిందట. ఆ తరువాత డెమాన్ పవన్ దగ్గర నానా రచ్చ చేసింది. అక్కడ అంత సిన్సియర్‌గా నామినేషన్‌ను అంగీకరించింది కేవలం డెమాన్ పవన్ ఉన్నాడనేనని చెప్పుకొచ్చింది. తనను తప్పకుండా సేవ్ చేస్తాడని అంగీకరించిందట. ఇక అసలు ఆమెలో సిన్సియారిటీ ఎక్కడుందనేది ప్రేక్షకుల అభిప్రాయం. ఇప్పటికే వీకెండ్‌లో నాగ్ (Host Nagarjuna) వచ్చేసి వీడియోలతో సహా ఆమె బండారం బయటపెట్టిన తర్వాత కూడా డెమాన్ ఆమెను సేవ్ చేస్తే జనాల్లో అతను ఎంత చులకన అవుతాడు? దారుణమైపోడా? రీతూ చౌదరి తన ఆటను చెడ గొట్టుకోవడమే కాకుండా పవన్ గేమ్‌ను కూడా చెడగొడుతోంది. వీరిద్దరి మధ్య జరిగిన చర్చ.. ఆ తరువాత మరో సీన్‌లో వీరిద్దరినీ చూసిన వారికి రీతూ చౌదరి మరీ ఇంత దిగజారిపోతోందేంటని అనిపించక మానదు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 23, 2025 11:11 AM