Biggboss 9: చేతులు కలిపిన రీతూ, మాదురి.. ఇద్దరి టార్గెట్ ఒకరే..
భరణికి బయట బీభత్సమైన నెగిటివిటీ ఉందని భావించి టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. మరోవైపు భరణితో తనూజ చాలా డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తూ వస్తోంది. ఇక రీతూ చౌదరి (Rithu Chowdary) కూడా దివ్వెల మాదురి (Divvela Madhuri)తో కలిసి పోయింది.

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu)లోకి ప్రస్తుతం కొత్తగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారు. వారు వచ్చి భరణి (Actor Bharani), తనూజ (Tanuja), దివ్య నికిత (Divya Nikitha) బంధాల గురించి హైలైట్ చేయడంతో పాటు వీకెండ్‌లో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒకమ్మాయి కూడా భరణి ఆట కనిపించడం లేదని.. బంధాలే కనిపిస్తున్నాయని.. కాబట్టి బయటకు పంపించేయాలని భావిస్తున్నట్టు చెప్పింది. ఇవన్నీ చూసిన హౌస్‌మేట్స్ భరణికి బయట బీభత్సమైన నెగిటివిటీ ఉందని భావించి టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. మరోవైపు భరణితో తనూజ చాలా డిస్టెన్స్ మెయిన్‌టైన్ చేస్తూ వస్తోంది. ఈమె కేవలం బిగ్‌బాస్ (Biggboss) కోసమే బంధం కొనసాగిస్తున్నట్టు క్లియర్‌గా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన వైల్డ్ కార్డ్స్, ఇప్పటికే హౌస్‌లో ఉన్నవారంతా కలిసి భరణినే టార్గెట్ చేయడం గమనార్హం. మొత్తానికి అంతా కలిపి భరణికి కావల్సినంత హైప్ ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది.
నామినేషన్స్ (Biggboss Nominations)లో దాదాపుగా అందరి టార్గెట్ భరణియే. ఇక రీతూ చౌదరి (Rithu Chowdary) కూడా దివ్వెల మాదురి (Divvela Madhuri)తో కలిసి పోయింది. వీరిద్దరికీ బయట బాగానే పరిచయం ఉన్నట్టుండటంతో ఇద్దరూ చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. పైగా భరణిని నామినేట్ చేయాలన్న మాదురి కోరికను రీతూ నెరవేర్చింది. ఇక రీతూ నామినేషన్ పాయింట్ ఏంటంటే.. భరణి తనకు సాయం చేస్తానని చేయలేదట. సమయం వచ్చినప్పుడు చేస్తానని భరణి. అది కరెక్టే తనకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు సాయం చేస్తారు కానీ ఎవరికైనా చెప్పిన వెంటనే ఎలా చేస్తారు? పైగా ఒక గంట ఫుడ్ లేటు అయిన కారణంగా కడుపు నొప్పి లేచిందట. దానికి దివ్య నికితను నామినేషన్ చేసింది. ప్రూట్స్ ఉన్నాయి తినవచ్చు కదా అని దివ్య అంటే ఆ విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చింది. దివ్య నికితను చాలా సిల్లీగా రీతూ నామినేట్ చేసింది.
ప్రజావాణి చీదిరాల