PM Modi: ఆ ఆలోచనలో మార్పే లేదు
ఉగ్రవాదం మానవాళికే ముప్పు అన్నారు. మతం పేరిట పహల్గాంలో జరిపిన మారణహోమానికి భారతదేశమంతా ఆగ్రహంతో రగిలిపోయిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ పేరిట ఊహించని దెబ్బ కొట్టి..

ప్రధాని మోదీ (PM Modi) స్వాతంత్ర్య దినోత్సవం (Indipendence Day) సందర్భంగా ఒక హుకుం జారీ చేశారు. ఎర్రకోట (Red Fort)పై వరుసగా 12వ సారి జాతీయ జెండాను (National Flag) ఎగురవేసిన అనంతరం మోదీ (Modi) ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. ఉగ్రవాదం మానవాళికే ముప్పు అన్నారు. మతం పేరిట పహల్గాంలో జరిపిన మారణహోమానికి భారతదేశమంతా ఆగ్రహంతో రగిలిపోయిందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్ పేరిట ఊహించని దెబ్బ కొట్టి ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.
శత్రుమూకలను ఎలా అంతం చేయాలనేది సైన్యం పని అని.. ఈ క్రమంలోనే లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేచ్ఛను త్రివిధ దళాలకే ఇచ్చినట్టుగా మోదీ తెలిపారు. భారత్ ఎప్పుడూ అణుబాంబు బెదిరింపులకు భయపడిందే లేదన్నారు. నీరు, రక్తం కలిసి ప్రవహించేందుకు అవకాశమే లేదని సింధూ జలాల (Sindhu Water) ఒప్పందంపై పేర్కొన్నారు. సింధూ జలాలను భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పే లేదని.. వాటిని తరలించిన తరువాత నీటి కొరత ఉన్న ప్రాంతాలకు వాటిని తరలిస్తామని తెలిపారు. సింధూ జలాలపై సంపూర్ణాధికారం భారత్ (India)దేనని.. ముఖ్యంగా భారత రైతులదని పేర్కొన్నారు. ఇక మీదట ఎప్పటికీ ఆ ఒప్పందం పునరుద్దరించబోమని.. చర్చలకు కూడా ఎప్పటికీ వెళ్లేది లేదని మోదీ స్పష్టం చేశారు. ఇక దేశ యువతకు మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. లక్ష కోట్ల రూపాయలతో యువత కోసం ప్రధాన మంత్రి వికసిత్ భారత్ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టినట్టు తెలిపారు. దీనిలో భాగంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు రూ.15వేలు అందించడమే కాకుండా వారు సరికొత్త ఆలోచనలకు ఎప్పుడూ అండగా ఉంటామన్నారు.