others Breaking News

వేల మందికి పురాణపండ ' శ్రీమాలిక'ను అందించిన నూజివీడు సీడ్స్ ప్రభాకర్

పురాణాలు, ఆగమాల్లోని కొన్ని ముఖ్యాంశాలతోపాటు ఉపయుక్తమైన ప్రామాణిక ఉదాత్త భావనలతో, ఉపాసనాంశాలతో, మహిమాన్విత స్తోత్రాలతో రూపొందిన గ్రంథం ‘శ్రీమాలిక’.

వేల మందికి పురాణపండ ' శ్రీమాలిక'ను అందించిన నూజివీడు సీడ్స్  ప్రభాకర్

పురాణాలు, ఆగమాల్లోని కొన్ని ముఖ్యాంశాలతోపాటు ఉపయుక్తమైన ప్రామాణిక ఉదాత్త భావనలతో, ఉపాసనాంశాలతో, మహిమాన్విత స్తోత్రాలతో రూపొందిన గ్రంథం ‘శ్రీమాలిక’. ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలన సంవిధానంగా ఈ గ్రంథం రూపొందింది. నాలుగు వందల పేజీలతో ' శ్రీమాలికను పురాణపండ శ్రీనివాస్ రచించారు. ఈ మంత్ర మహాగ్రంథం తెలుగు రాష్ట్రాలలో వందల కొలది ఆలయాల్లో, పీఠాల్లో, మఠాల్లో , ధార్మిక పరిషత్‌లలో పెద్ద ఎత్తున సందడి చేస్తోంది.

కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి అమృత హస్తాలతో గతేడాది ' శ్రీమాలిక ' ఆవిష్కరించబడింది. ఈ గ్రంథం విశేషమేంటంటే.. ఇప్పటికి ఇరవై ఐదు పునర్ముద్రణలు జరుపుకుంది. దీంతో ఈ గ్రంథం సాహిత్య ఆధ్యాత్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, జాతీయ పురస్కార గ్రహీత, నూజివీడు సీడ్స్ చైర్మన్ మండవ ప్రభాకర రావు తన తండ్రి - నూజివీడు సీడ్స్ ఫౌండర్ మండవ వెంకట్రామయ్య స్మృతిగా స్వగ్రామమైన నూజివీడులో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీమాలిక గ్రంధాన్ని వందలాది ప్రతులు అందించారు. అలాగే జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో పలువురు ఫ్యాప్సీ సభ్యులకు, సినీ రాజకీయ ప్రముఖులకు సైతం కొన్ని వేల గ్రంథాలను అందించి హాట్ టాపిక్‌గా మారారు.

శ్రీ మాలికలో అప మృత్యువు, కాల మృత్యువు భయాల్ని తొలగించే మహా నృసింహావిర్భాఘట్టాన్ని పురాణపండ శ్రీనివాస్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఉపరాష్ట్రపతి ఎమ్ . వెంకయ్యనాయుడు మాజీ మహాసౌందర్య స్వరూపంగా ఆవిష్కరించారంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల పాలనలో తెలుగునాట సంక్షేమం వెల్లివిరియాలని కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో ప్రచురించబడిన శ్రీమాలిక దివ్య గ్రంథాలను టీడీపీ, జనసేన శ్రేణులకు పంచడం జరిగింది. వేల కొలది ప్రతులు తిరుపతి, అమరావతి, నెల్లూరు , విజయవాడ , శ్రీశైలం , విశాఖపట్నం తదితర ప్రాంతాలలో బొల్లినేని అందించారు. కుప్పం , నారావారిపల్లె ప్రాంతాలలో వందలకొలది ముత్తయిదువులకు చంద్రబాబు సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి నూతన వస్త్రాలతో శ్రీమాలికను చేర్చి స్వయంగా పంచడం విశేషం.

అక్కడి పెద్ద తరాలు ఈ గ్రంథాన్ని చదివి ప్రశంసించడం మరో విశేషం. ఇటీవల చెన్నైలో జరిగిన వరల్డ్ తెలుగు ఫెడరేషన్ నిర్వహించిన తెలుగు మహోత్సవంలోనూ శ్రీమాలిక సందడి చేసింది. అలాగే విజయవాడ ఇంద్రకీలాద్రి సంక్రాంతి యజ్ఞ యాగాది క్రతువుల్లోనూ, యాదాద్రి లక్ష్మీ నారసింహుని సహస్ర కలశ అభిషేక ఉత్సవం లోను వందలకొలది భక్తులకు బొల్లినేని కృష్ణయ్య , శ్రీమతి సుజాత దంపతులు అందించారు. శ్రీమాలిక వంటి మంగళ గ్రంథాన్ని సమర్పించడం పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్నట్లు నూజివీడు సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మండవ ఆశాప్రియ ఆనందం వ్యక్తం చేశారు. తన వియ్యంకుడు ప్రభాకరరావు, ఆషాప్రియ దంపతులు ఈ మంగళకార్యం చెయ్యడం పట్ల బొల్లినేని క్రిష్ణయ్య సైతం సంతోషం వ్యక్తం చేశారు. మానవ జన్మలో ఎన్ని కోట్లు సంపాదించినా చివరికి మిగిలేది ఇలాంటి అద్భుత పుణ్యకార్యాలేనని నూజివీడు సీడ్స్ ఉద్యోగ బృందం తమ యజమాని పట్ల కృతజ్ఞతాభావాన్ని ప్రకటించాయి.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 22, 2026 9:49 AM