others

Shocking News: మిస్ ఆసియా అందాల పోటీలు.. అందగత్తెలంతా ర్యాంప్ వాక్ చేస్తుండగా షాకింగ్ ఘటన..

మిస్ ఆసియా (Miss Asia) – పసిఫిక్ ఇంటర్నేషనల్ - 2025 (Pacific International - 2025) అందాల పోటీ (Beauty Pageant) అట్టహాసంగా జరుగుతోంది. ఆసియాకు చెందిన అందగత్తెలంతా ఒకచోట చేరారు.

Shocking News: మిస్ ఆసియా అందాల పోటీలు.. అందగత్తెలంతా ర్యాంప్ వాక్ చేస్తుండగా షాకింగ్ ఘటన..

మిస్ ఆసియా (Miss Asia) – పసిఫిక్ ఇంటర్నేషనల్ - 2025 (Pacific International - 2025) అందాల పోటీ (Beauty Pageant) అట్టహాసంగా జరుగుతోంది. ఆసియాకు చెందిన అందగత్తెలంతా ఒకచోట చేరారు. ర్యాంప్ వాక్ (Ramp walk) జరుగుతోంది. అందగత్తెలంతా హొయలొలికిస్తూ.. హంసల మాదిరిగా ర్యాంప్ వాక్ చేస్తున్నారు. ఒక్కసారిగా అనుకోని ఘటన. అంతా వణికిపోయారు. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. ఎటొళ్లటు పరుగులు తీశారు. అసలేం జరిగింది? ఎందుకు అందగత్తెలంతా అలా షేక్ అయిపోయారు? తెలుసుకుందాం.

ఫిలిప్పీన్స్‌ (Philippines)లోని సెబుల్‌లో మిస్ ఆసియా – పసిఫిక్ ఇంటర్నేషనల్ - 2025 జరుగుతోంది. ఈ కార్యక్రమం రాడిసన్ బ్లూ సెబు హోటల్‌ (Radisson Blue Cebu Hotel)లో రన్‌ వేపై మంగళవారం రాత్రి అందగత్తెలంతా ర్యాంప్ వాక్ చేస్తున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించింది. దీంతో అందగత్తెలకు ఏం చేయాలో పాలుపోలేదు సరికదా అంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎటు వాళ్లు అటు పరుగులు తీశారు. మొత్తానికి ఒక అందమైన ఈవెంట్ కాస్తా భయం భయంగా గడిచింది. కొద్ది క్షణాలు అక్కడున్న వారంతా వణికిపోయారు. ముఖ్యంగా ఈ భూకంపం (Earthquake) తీవ్రత రిక్టర్‌ స్కేలు (Richter scale)పై 6.9గా నమోదైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సెబు ప్రావిన్సులోని బోగో నగరానికి 19 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. భూకంప తీవ్రత (Earthquake intensity)కు 69 మంది మరణించారు. అలాగే 150 మందికి పైగా గాయపడగా.. ఇంకా మృతుల సంఖ్య పెరిగినట్టు సైతం సమాచారం. ఇక మృతుల్లో ఎక్కువ మంది బోగో నగర వాసులేనని తెలుస్తోంది. భూకంపం కారణంగా ఈ నగరంలోని అనేక ఇళ్లు, రోడ్లు చాలా వరకూ దెబ్బతిన్నాయి. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో నష్టం ఎక్కువగా జరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. భూకంపం నేపథ్యంలో తొలుత సునామీ (Tsunami) హెచ్చరికలను సైతం అధికారులు జారీ చేసిన మీదట.. ఆ తరువాత కంగారేమీ లేదని సునామీ సంభవించే అవకాశం లేదని వెల్లడించారు.

భూకంప తీవ్రత కారణంగా నివాసాలతో పాటు వ్యాపార భవనాలు, వంతెనలన్నీ కూలిపోయాయి. అంతేకాకుండా ఈ ఏడాది దేశంలో సంభవించిన అత్యంత ప్రమాదకరమైన విపత్తుల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఇక అందాల పోటీ విషయానికి వస్తే.. ఎవరికీ ఎలాంటి హాని అయితే జరగలేదు. అయితే అందాల పోటీకి మాత్రం తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా అందాల పోటీలు జరుగుతున్న సమయంలో భూకంపం సంభవించడంతో అభిమానులతో పాటు నిర్వాహకులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఇలాంటి విపత్కర తరుణంలో తాము సెబులోని సోదరులు, సోదరీమణులతో నిలబడతామని.. వారి కోసం ఎలాంటి సాయమందించేందుకైనా సిద్ధమని తెలిపారు. భూకంపం కారణంగా విద్యుత్తుకు అంతరాయం (Power Cut) ఏర్పడింది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 2, 2025 8:10 AM