Operation Sindoor: స్థావరాన్ని మారుస్తున్న పాక్‌కు చెందిన మేజర్ టెర్రిరిస్ట్ సంస్థలు
ఆపరేషన్ సిందూర్‌తో సమయంలో పాకిస్తాన్‌లోని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది ఉగ్ర స్థావరాలను నిర్మూలించింది. పాక్ మాత్రం తమ భూభాగంలో ఏమీ డ్యామేజ్ కాలేదని..

ఆపరేషన్ సిందూర్‌తో సమయంలో పాకిస్తాన్‌లోని ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా తొమ్మిది ఉగ్ర స్థావరాలను నిర్మూలించింది. పాక్ మాత్రం తమ భూభాగంలో ఏమీ డ్యామేజ్ కాలేదని.. పైగా తామే కౌంటర్ ఆపరేషన్ చేసి భారత యుద్ధ విమానాలను కూల్చేశామని చెబుతోంది. అయితే జైష్-ఎ-ముహమ్మద్ (Jaish-e-Muhammed), హిజ్బుల్ ముజాహిదీన్ (Hizbul Mujahideen) వంటి ఉగ్రవాద సంస్థలు మాత్రం భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో తమ స్థావరాలు దాడుల్లో నాశనమయ్యాయని వెల్లడించాయి. ఈ క్రమంలోనే ష్-ఎ-ముహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు తాజాగా పాకిస్తాన్ లోపలికి ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా వచ్చేశాయని.. ఈ రెండు ఉగ్రవాద సంస్థలు తమ స్థావరాలను ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ (KPK)కి మారుస్తున్నాయని నిఘా సంస్థకు విశ్వసనీయ సమాచారం అందింది.
ఖైబర్ ప్రాంతంలోని మన్సెహ్రాలో ఉన్న జైష్-ఎ-ఇస్లాం శిక్షణా కేంద్రాన్ని - మర్కజ్ షోహాద-ఎ-ఇస్లాం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. నిర్మాణ కార్యకలాపాలకు సంబంధించిన ఛాయా చిత్రాలు నిఘా సంస్థ చేతికి చిక్కాయి. మరోవైపు మాజీ ఎస్ఎస్‌జీ కమాండో ఖలీద్ ఖాన్ నేతృత్వంలోని హిజ్బ్, కేపీకేలోని బందాయ్‌లో ‘HM-313’ అనే కొత్త శిక్షణా కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ల్యాండ్‌ను గత ఏడాది ఆగస్ట్‌లోని కొనుగోలు చేశారు. అయితే అక్కడ నిర్మాణం మాత్రం ఈ ఏడాది మేలో ప్రారంభమైంది. నిర్మాణం ఎక్కడి వరకూ వచ్చిందనే విషయాన్ని సైతం నిఘా సంస్థలకు లభ్యమైన ఛాయా చిత్రాలు తెలియజేస్తున్నాయి. సెప్టెంబర్ 25న, ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన మసూద్ అజార్ సోదరుడు యూసుఫ్ అజార్ జ్ఞాపకార్థం పెషావర్‌లోని మర్కజ్ షహీద్ మక్సుదాబాద్‌లో జెఎం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది.