others

USA: అంతా ఏసయ్యే చేశాడట.. అమెరికన్ కమాండర్ల కొత్త వాదన..

కొన్నిసార్లు దేవుడు నోరు విప్పితే బాగుండు.. చక్కగా మాట్లాడితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే.. చాలా సార్లు మనం చేసే తప్పులు భగవంతుడిపై నెట్టేస్తూ ఉంటాం. తాజాగా అమెరికా కమాండర్స్ కొందరు అదే చేశారు.

USA: అంతా ఏసయ్యే చేశాడట.. అమెరికన్ కమాండర్ల కొత్త వాదన..

కొన్నిసార్లు దేవుడు నోరు విప్పితే బాగుండు.. చక్కగా మాట్లాడితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే.. చాలా సార్లు మనం చేసే తప్పులు భగవంతుడిపై నెట్టేస్తూ ఉంటాం. తాజాగా అమెరికా కమాండర్స్ కొందరు అదే చేశారు. ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సరికొత్త వాదనను అమెరికా తెరపైకి తీసుకొచ్చింది. అదేంటంటే.. చేసేదెవరు? చేయించేదెవరు? అంతా ఏసయ్యేనని అంటున్నారు. అవును వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వయంగా యేసు క్రీస్తే కలలోకి వచ్చి మరీ ఇరాన్‌పై యుద్ధం చేయాలని సూచించాడట. ఇది ఎవరో చెప్పింది కాదు. కొందరు కమాండర్లు సైనికులకు చెప్పారట. ఇవి కాస్తా పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. సందేశం ఇచ్చి ఇరాన్‌పై యుద్ధం చేయాలని సూచించాడని కొందరు కమాండర్లు సైనికులకు చెప్పినట్లు వచ్చిన రిపోర్టులు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. దీనిపై మిలిటరీలోనే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్రంప్ ఎవరంటారా?

అమెరికా సైన్యంలో మత స్వేచ్ఛను పరిరక్షించే వాచ్‌డాగ్ సంస్థ మిలిటరీ రిలిజియస్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఎంఆర్ఎఫ్ఎఫ్) ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అవి కాస్తా వివాదాన్ని మరింత పెంచాయి. అమెరికా సైన్యం నుంచి తమకు చాలా ఫిర్యాదులు అందాయని.. వాటిలో సైనికులకు కొందరు కమాండర్లు మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు యుద్ధాన్ని దేవుడి సంకల్పంగా చిత్రీకరిస్తున్నారని పేర్కొనడం జరిగింది. ఈ క్రమంలోనే కొందరు సైనిక కమాండర్లు బైబిల్‌లో పేర్కొన్న అర్మాగెడ్డాన్ గురించి తమ బ్రీఫింగ్‌లో పేర్కొన్నారు. అర్మాగెడ్డాన్ అంటే చెడుపై దేవుడి తుదిపోరు అని అర్థం. ప్రపంచంలో చెడు నిర్మూలనకు ఈ యుద్ధాన్ని దేవుడే డిసైడ్ చేశాడట. మరి ట్రంప్ ఎవరంటారా? యుద్ధం కోసం దేవుడు ఎంపిక చేసిన నాయకుడట.

అధికారిక ఫిర్యాదు..

టోటల్‌గా ఇరాన్‌పై యుద్ధం అనేది దేవుడి నిర్ణయమని.. మనమంతా దేవుడి కోసం పోరాడాలనే వ్యాఖ్యలు కూడా ఫిర్యాదుల్లో అమెరికన్ సైనిక కమాండర్లు పేర్కొంటున్నారట. అమెరికన్ సైన్యంలో కేవలం క్రైస్తవులే కాకుండా ముస్లింలు, యూదులు, నాస్తికులు సహా పలు మతాలకు చెందిన వారున్నారు. వారికి ఈ వ్యాఖ్యలు నచ్చడం లేదట. దీంతో వారంతా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారట. అంతేకాకుండా సైన్యంలో విభేదాలను సృష్టిస్తున్నాయి. బ్రీఫింగ్‌కు హాజరైన ఒక నాన్ కమిషన్డ్ ఆఫీసర్.. దీనిపై కొందరు సైనికుల తరుఫున ఎంఆర్ఎఫ్ఎఫ్‌కు అధికారిక ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయిన జోనాథన్ లార్సోన్ తన సబ్‌స్టాక్ ప్లాట్‌ఫారంలో రిపోర్ట్ చేయడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.

మతపరమైన యుద్ధంగా చూపించడమేంటి?

ఎంఆర్ఎఫ్ఎఫ్ ప్రకారం అమెరికా సైన్యంలో ఉన్న వివిధ స్థావరాల నుంచి మొత్తం 30కి పైగా బేస్‌లలోని 40 యూనిట్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. కమాండర్లు మతపరమైన భావజాలాన్ని సైనికులపై బలవంతంగా రుద్దుతున్నారని.. ఇలాంటివి మత స్వేచ్ఛకు విరుద్ధమని పేర్కొంటున్నారు. అంతేకాకుండా తమ మధ్య ఐక్యతను సదరు కమాండర్ల వ్యాఖ్యలు దెబ్బతీస్తున్నాయని అమెరికన్ సైనికులు పేర్కొంటున్నారు. తామేమో అమెరికా రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రమాణం చేసి యుద్ధంలోకి దిగితే దీనిని మతపరమైన యుద్ధంగా చూపించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 5, 2026 6:14 AM