others

Biggboss 9: శ్రీజ రీ ఎంట్రీ ఫిక్స్? తనను సేవ్ చేయమంటూ రీతూ బెగ్గింగ్..

వాస్తవానికి గత వారం ఓటింగ్ ప్రకారమైతే డెమాన్ పవన్ (Demon Pawan), రీతూ చౌదరి (Rithu Chowdary), ఫ్లోరా షైనీ (Flora Shaini)ల్లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది.

Biggboss 9: శ్రీజ రీ ఎంట్రీ ఫిక్స్? తనను సేవ్ చేయమంటూ రీతూ బెగ్గింగ్..

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu)లో గత వారం డబుల్ ఎలిమినేషన్ (Biggboss Double Elimination) జరిగింది. దీనిలో భాగంగా ప్రేక్షకుల ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ (Biggboss Elimination) జరిగింది. వాస్తవానికి గత వారం ఓటింగ్ ప్రకారమైతే డెమాన్ పవన్ (Demon Pawan), రీతూ చౌదరి (Rithu Chowdary), ఫ్లోరా షైనీ (Flora Shaini)ల్లో ఇద్దరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. వాస్తవానికి ప్రేక్షకుల ఓటింగ్ పరంగా రీతూతో పాటు పవన్, ఫ్లోరాల్లో ఒకరు వెళ్లిపోయి ఉండాల్సింది. కానీ ఫ్లోరాతో పాటు శ్రీజ (Srija Dammu)ను బిగ్‌బాస్ టీం ఎలిమినేట్ చేసింది. ఇది అన్ ఫెయిర్ అని పెద్ద ఎత్తున సోషల్ మీడియా (Social Media)లో టాక్ నడుస్తోంది. విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే శ్రీజ రీఎంట్రీ (Srija Re-entry)కి మార్గం సుగమం అయినట్టు తెలుస్తోంది. షో (Biggboss Show)పై బీభత్సమైన నెగిటివిటీ పెరిగిపోవడంతో బిగ్‌బాస్ టీం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

బిగ్‌బాస్ షోపై విమర్శలు వెల్లువెత్తడంతో శ్రీజను తిరిగి హౌస్‌ (Biggboss House)లోకి పంపాలని బిగ్‌బాస్ టీం (Biggboss Team) యోచిస్తోందట. ఇదిలా ఉండగా.. రీతూ చౌదరి (Rithu Chowdary) బెగ్గింగ్ మరీ దారుణం. ఎవరు కెప్టెన్‌గా ఉంటే వారిని తను నామినేషన్‌లో ఉంటే సేవ్ చేయాలని అడుగుతోంది. గత వారం రామూ రాథోడ్ (Ramu Rathod), ఈవారం కల్యాణ్ పడాలను అడుగుతోంది. ఇక ఎన్ని సార్లు ఇలా తనను సేవ్ చేయాలని అడుగుతుందో తెలియడం లేదు. ఇక డెమాన్ పవన్ వచ్చేసి హౌస్‌లో ఏదైనా లవ్ ట్రాక్ నడపాలని ముందుగా ఫిక్స్ అయిపోయే హౌస్‌లోకి వచ్చాడట. ఈ విషయాన్ని శ్రీజ దమ్ము బిగ్‌బాస్ బజ్‌లో చెప్పింది. హౌస్‌లోకి వచ్చాక కూడా అదే చేస్తున్నాడని.. రీతూ కూడ కావాలనే లవ్ ట్రాక్ నడుపుతోందని తెలిపింది. వాస్తవానికి శ్రీజ, డెమాన్ పవన్ ఇద్దరు బయట ఫ్రెండ్స్.. అంతేకాదండోయ్.. వీరిద్దరూ కాలేజ్ నుంచే స్నేహితులు. అందుకే లవ్ ట్రాక్ గురించి ముందుగానే శ్రీజకు చెప్పాడని ఆమే చెబుతోంది.

ప్రజావాణి చీదిరాల

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 13, 2025 4:30 PM