others Breaking News

‘ఎన్‌ఫర్‌యు’లో నథింగ్ 4Aను లాంచ్ చేసిన ఇనయా సుల్తానా

హైదరాబాద్‌కి నథింగ్ 4A ఫోన్ వచ్చేసింది. నేడు అమీర్‌పేట్‌లోని ఎన్‌ఫర్‌యు (N4U) మొబైల్ షోరూమ్‌లో నథింగ్ మొబైల్స్ నుంచి నథింగ్ 4ఏ మొబైల్‌ను నటి ఇనయా సుల్తానా చేతుల మీదగా లాంచ్ చేయడం జరిగింది.

‘ఎన్‌ఫర్‌యు’లో నథింగ్ 4Aను లాంచ్ చేసిన ఇనయా సుల్తానా

హైదరాబాద్‌కి నథింగ్ 4A ఫోన్ వచ్చేసింది. నేడు అమీర్‌పేట్‌లోని ఎన్‌ఫర్‌యు (N4U) మొబైల్ షోరూమ్‌లో నథింగ్ మొబైల్స్ నుంచి నథింగ్ 4ఏ మొబైల్‌ను నటి ఇనయా సుల్తానా చేతుల మీదగా లాంచ్ చేయడం జరిగింది. అమీర్‌పేట త్రిపుల్ఏ మాల్ (సత్యం థియేటర్) ఎదురుగా ఉన్న ఈ ఎన్‌ఫర్‌యు మొబైల్ షోరూమ్‌లో ఈ లాంచింగ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా నథింగ్ 4ఏ సిరీస్‌ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ అన్నీ షోరూం యాజమాన్యంతో కలిసి ఇనయా సుల్తానా వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా ఇనయా సుల్తానా మాట్లాడుతూ... ఇవాళ నథింగ్ 4A మొబైల్ లాంచ్ కావడం సంతోషంగా ఉందని... అందరికీ అందుబాటులో ఉండే ధరలో కేవలం రూ.31,999కే మంచి ఫీచర్స్‌తో ఈ మొబైల్ ప్రేక్షకుల ముందుకు వచ్చిందన్నారు. అన్ని గేమింగ్స్‌కు ఈ మొబైల్ పర్‌ఫెక్ట్‌గా సపోర్ట్ చేస్తుందని తెలిపారు. ఇక ఈ సిరీస్ ఫీచర్స్ విషయానికి వస్తే.. 50ఎంపీ రేర్ కెమెరా, 32ఎంపీ ఫ్రంట్ కెమెరాతో ఫోటోస్ తీసుకునేందుకు అనువైన ఫీచర్స్ అన్నీ ఉన్నాయన్నారు. మనకి కావలసిన ఫీచర్స్ అన్నీ ఒకటే మొబైల్లో అతి తక్కువ ధరలో దొరుకుతున్నాయని అన్నారు. కేవలం నథింగ్ 4ఏలోనే ఇది సాధ్యమని ఇనయా సుల్తానా తెలిపారు. ఈరోజే ఈ మొబైల్ లాంచ్ కావడంతో ఎన్నో ఆఫర్స్ నడుస్తున్నాయని... అలాగే ఎన్‌ఫర్‌యు షోరూంలో జీరో డౌన్ పేమెంట్ తో ఈ మొబైల్ మీ సొంతం చేసుకోవచ్చని ఇనయా సుల్తానా తెలిపారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 13, 2026 12:12 PM