others

Biggboss 9: బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్స్‌గా ఎవరొస్తున్నారో తెలిస్తే..

మరికొందరు సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లో అడుగు పెట్టనున్నారు. ఈ లిస్ట్‌లో బాగా కాంట్రవర్శియల్ అయినవారు కూడా ఉన్నారు. వారెవరో ముందుగా చూద్దాం.

Biggboss 9: బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్స్‌గా ఎవరొస్తున్నారో తెలిస్తే..

బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ (Biggboss Wildcards) ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది. ఈ నెల 11 లేదంటే 12 తేదీల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని టాక్ నడుస్తోంది. బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. ప్రస్తుతం హౌస్‌ (Biggboss House)లో ఉన్నవారు పర్వాలేదన్నట్టుగానే ఉన్నారు. సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్ (Biggboss Celebrities Vs Common man) అనేది ఆదిలో పెద్దగా ఆసక్తికరంగా లేదు కానీ ఇప్పుడు మాత్రం ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. అయితే కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి ఇటీవలే దివ్య నికిత (Divya Nikitha) హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె టాస్కుల్లోనూ.. పాయింట్స్ పెట్టడంలోనూ దిట్ట. ప్రస్తుతం ఉన్న కామన్ మ్యాన్ కేటగిరీలోని వారందరి కంటే కూడా బెటర్‌గా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే కల్యాణ్ పడాల (Pawan Kalyan Padala) తన సత్తా చాటుతున్నాడు. శ్రీజ (Srija) కూడా తనను తాను మార్చుకుని మరీ ఆటలో దిగింది.

ఇక సెలబ్రిటీలలో ఇమ్మాన్యుయేల్ (Emmanuel), భరణి (Actor Bharani), రామూ రాథోడ్ (Ramu Rathod), సంజన (Sanjana), తనూజ (Tanuja), సుమన్ శెట్టి (Suman Shetty) ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ రకంగా చూస్తే సెలబ్రిటీలంతా దాదాపుగా చక్కగా రాణిస్తున్నారు. వీరికి తోడు మరికొందరు సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టనున్నారు. ఈ లిస్ట్‌లో బాగా కాంట్రవర్శియల్ అయినవారు కూడా ఉన్నారు. వారెవరో ముందుగా చూద్దాం. నిఖిల్ నాయర్ (Serial Actor Nikhil Nayar).. ఆయన ఒక సీరియల్ యాక్టర్. గృహలక్ష్మి వంటి సీరియల్స్‌లో నటించాడు. ఇతను మంచి హైట్, ఫిజిక్ పరంగా కూడా చాలా బాగున్నాడు. ఫిజికల్ టాస్క్‌ల్లో ఈయనను కొట్టడం కాస్త కష్టమే. రెండో వ్యక్తి.. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య (Alekhya Chitti Pickles Ramya).. ఈమె ఎంత కాంట్రవర్షియల్ పర్సన్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమెను ఆర్గ్యుమెంట్స్‌లో కొట్టడం కొంచెం కష్టమే. సంజనాకు మంచి అప్పోనెంట్ అని చెప్పాలి. ఇప్పటి వరకూ కంటెంట్ ఇవ్వడం కోసం ఏమైనా చేసేందుకు వెనుకాడని సంజనను ఢీకొట్టే పర్సన్ రమ్య.

ఇక దివ్వెల మాధురి (Divvela Madhuri). ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫేమస్. ముఖ్యంగా పొలిటికల్‌గా బాగా పాపులర్. ఈమె ఎవ్వరినీ లెక్క చేసే రకం కాదు. ఒకటికి పది అప్పజెబుతుంది. ఇలాంటి ఆమె బిగ్‌బాస్‌ (Biggboss)లో ఉంటే షో ఎలా ఉంటుందో చూడాలి. ఆ తరువాత మరో కంటెంస్టెంట్ అఖిల్ రాజ్.. ఇతను షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లలో నటించాడు. ఇతను చూసేందుకు చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. ఇతను టాస్క్‌లు, పాయింట్స్ ఎలా పెడతాడో కానీ బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని మార్పులు అయితే తీసుకొస్తాడనడంలో సందేహం లేదు. మరి బిగ్‌బాస్ హౌస్‌లో ఎలా ఉంటారో తెలియదు కానీ ఇక ప్రభాస్ శ్రీను (Prabhas Srinu).. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఎన్నో చిత్రాల్లో నటించి బాగా ఫేమస్ అయ్యాడు. ఇక ఫైనల్‌గా ఈటీవీ ప్రభాకర్ (Etv Prabhakar) కూడా ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు కానీ అది కన్ఫర్మ్ కాదని తెలుస్తోంది. పైన చెప్పన వ్యక్తులు మాత్రం దాదాపుగా ఫిక్స్ అని సమాచారం. ఇక చూడాలి ఏమవుతుందో..

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 5, 2025 2:15 PM