ఖైరతాబాద్ వినాయకుడి గురించి ఈ విషయాలు తెలిస్తే..
ఇక తొలినాళ్లలో హైదరాబాద్‌లోని వినాయకుళ్లందరినీ నిమజ్జనం చేసిన కూడా ఈ గణపయ్య పూజలు అందుకుంటూనే ఉండేవాడు. 1982లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి రెండు పడవలను వినియోగించారు

వినాయకచవితి అనగానే తెలుగు రాష్ట్రాల వారికి ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. వినాయక చవితికి కొన్ని నెలల ముందు నుంచే ఈ ఖైరతాబాద్ వినాయకుడి పనులు ప్రారంభమవుతాయి. ఏ ఏటికాఏడు చాలా ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఈ బడా గణపతిని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. అసలు ఈ వినాయకుడు ఎందుకు అంత ప్రత్యేకంగా మారాడు? తెలుసుకుందాం.
1954లో ఈ ఖైరతాబాద్ వినాయకుడి (Khairathabad Vinayaka) ప్రస్థానం ప్రారంభమైంది. స్వాతంత్ర్య సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ (Bala Gangadhar Tilak) ప్రేరణతో అప్పటి కౌన్సిలర్ సింగరి శంకరయ్య ఈ వినాయక ప్రతిష్టను ప్రారంభించారు. తొలినాళ్లలో కేవలం అడుగు ఎత్తుతో ప్రారంభమైన వినాయకుడు (Vinayaka).. 2024 వచ్చేసరికి 70 అడుగులకు చేరాడు. అప్పట్లో దేశ సమైక్యతకు వినాయకచవితి కూడా ఎంతగానో ఉపయోగపడేది. అలా ఖైరతాబాద్‌లోనూ ప్రారంభమైంది. ఇక తొలినాళ్లలో హైదరాబాద్‌లోని వినాయకుళ్లందరినీ నిమజ్జనం చేసిన కూడా ఈ గణపయ్య (Ganapathi) పూజలు అందుకుంటూనే ఉండేవాడు. దాదాపుగా నెల రోజుల పాటు పూజలందుకున్న మీదటే నిమజ్జనానికి తరలి వెళ్లేవాడు. అప్పట్లో అంటే 1960లో ఖైరతాబాద్ వినాయకుడు చిన్నగానే ఉండేవాడు కాబట్టి ఏనుగు (Elephant)పై ఊరేగిస్తూ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ (Hussain Sagar)కు తరలించేవారట.
కాశీ నుంచి రుద్రాక్షలు..
ఆ తరువాత 1982లో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి రెండు పడవలను వినియోగించారు. రెండింటినీ కలిపి వాటిపై ఖైరతాబాద్ వినాయకుడిని తీసుకెళ్లి హుస్సేన్ సాగర్ మధ్యలో నిమజ్జనం చేశారు. గత కొన్నేళ్లుగా ఈ బడా గణేశుడి రూపకల్పన కోసం పెద్ద ఎత్తున కళాకారులు బృందాలుగా ఏర్పడి మరీ పని చేసి ఫైనల్‌గా అందమైన అపురూపమైన గణపతిని భక్తుల ముందుకు తీసుకువస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి పూజ రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుంది. అనంతరం 10 గంటలకు 20 మంది సిద్దాంతులు కలశ పూజ నిర్వహించి ఆపై గణేశుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ సారి ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు 69 అడుగులు... 28 అడుగుల వెడల్పు. త్రిమూర్తుల సమేతుడై శాంతమూర్తిగా గణపయ్య దర్శనమివ్వనున్నాడు. అలాగే పూరి జగన్నాథుడు తన సోదరి, సోదరుడితో కలిసి దర్శనమివ్వనున్నాడు. గణపతి కోసం కాశీ (Kasi) నుంచి లక్ష రుద్రాక్షలు తీసుకు వచ్చి మెడలో వేయనున్నారు. చేనేత కార్మికులు (Handloom workers) తమ వంతుగా ఖైరతాబాద్ వినాయకుడికి 60 అడుగుల భారీ చేనేత నూలు కండువా, 60 అడుగుల గాయత్రి యజ్ఞోపవీతాన్ని సమర్పించనున్నారు.