others

iPhone 16: ఐఫోన్ 16 ధర ఎంత తగ్గిందో తెలిస్తే..

ప్రస్తుతం ఐఫోన్ 17 అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పటికీ వెనిల్లా ఐఫోన్ 16 ది బెస్ట్ ఆపిల్ స్మార్ట్ ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో, ఐఫోన్ 16 భారతదేశంలో ఆపిల్ అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ అని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.

iPhone 16: ఐఫోన్ 16 ధర ఎంత తగ్గిందో తెలిస్తే..

ప్రస్తుతం ఐఫోన్ 17 అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పటికీ వెనిల్లా ఐఫోన్ 16 ది బెస్ట్ ఆపిల్ స్మార్ట్ ఫోన్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో, ఐఫోన్ 16 భారతదేశంలో ఆపిల్ అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ అని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో మొత్తం స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో దాదాపు నాలుగు శాతం వాటాను కలిగి ఉంది. గత సంవత్సరం ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,990, కానీ ఇప్పుడు టాటా యాజమాన్యంలోని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ క్రోమా దీనిని చాలా తక్కువకు విక్రయిస్తోంది. దాదాపుగా రూ.15 వేలకు తక్కువగా విక్రయించడం ఆసక్తికరం. క్రోమాలో రూ. 65,000 కంటే తక్కువకు ఆపిల్ ఐఫోన్ లభిస్తోంది.

అయితే ఎవరైనా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే... 128GB స్టోరేజ్‌తో వచ్చే ఐఫోన్ 16 బేస్ వేరియంట్ క్రోమాలో 5 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. నలుపు, తెలుపు, పింక్, అల్ట్రామెరైన్, టీల్ వేరియంట్స్‌లో లభిస్తోంది. అయితే దీనిపై ఎటువంటి బ్యాంక్ ఆఫర్‌లు లేకుండా అయితే ఫోన్ రూ. 66,990కి అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ, ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.4 వేల వరకూ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కారణంగా ఐఫోన్ ధర మరింత తగ్గి రూ.62,990కి లభిస్తోంది.

ఐఫోన్ 16.. 256GB, 512GB వేరియంట్‌లను రూ.76,490కి పైన పేర్కొన్న బ్యాంక్ ఆఫర్‌లతో క్రోమా విక్రయిస్తోంది. అంటే దానిని రూ.72,490 కంటే తక్కువ ధరకు పొందవచ్చు. ఐఫోన్ 16 అనేది 6.1-అంగుళాల OLED స్క్రీన్‌తో కూడిన కాంపాక్ట్ స్మార్ట్‌ఫోన్. Apple A18 చిప్‌సెట్‌తో నడిచే ఈ ఫోన్‌లో 48MP ప్రైమరీ కెమెరాతో పాటు 12MP అల్ట్రావైడ్ షూటర్ కూడా ఉంది. కేవలం 170 గ్రాముల బరువున్న ఐఫోన్ 16.. IP68 డస్ట్.. వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 25W వైర్డు.. 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో ఇవ్వడం జరుగుతుంది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 2, 2025 10:04 AM