others

horoscope today 10 January: నేడు ఈ రాశుల వారికి లక్కే లక్కు..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం నాడు చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తుండగా.. హస్తా నక్షత్ర ప్రభావం వచ్చేసి ద్వాదశ రాశులపై ఉంటుంది. మరోవైపు శని, చంద్రుడి ప్రభావంతో గజకేసరి, అమల వంటి శుభ యోగాలు ఏర్పడనున్నాయి.

horoscope today 10 January: నేడు ఈ రాశుల వారికి లక్కే లక్కు..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం నాడు చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తుండగా.. హస్తా నక్షత్ర ప్రభావం వచ్చేసి ద్వాదశ రాశులపై ఉంటుంది. మరోవైపు శని, చంద్రుడి ప్రభావంతో గజకేసరి, అమల వంటి శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల కారణంగా మొత్తంగా ఐదు రాశుల వారికి శనీశ్వరుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుండగా.. కొన్ని రాశుల వారికి మాత్రం ప్రతికూల ఫలితాలు రానున్నాయి. మొత్తానికి కొన్ని రాశుల వారికైతే లక్కే లక్కు. మేషం నుంచి మీన రాశి వరకూ ఫలితాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేషరాశి (Aries Horoscope)

మేషరాశి వారికి పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే వ్యాపారులకు సైత బాగా కలిసొచ్చి ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు మా్రం పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇవాళ శని చాలీసా పఠిస్తే పరిస్థితులు అనుకూలంగా మారతాయి.

వృషభ రాశి (Taurus Horoscope)

వృషభ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఏ పని చేపట్టినా మంచి ఫలితాలు రావడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం, ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. ఇవాళ శనీశ్వరుడిని దర్శించుకుని నల్ల నువ్వులను దానంగా ఇవ్వాలి.

మిథున రాశి (Gemini Horoscope)

మిథున రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా పురోగతి, కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తాయి. శని దేవుని ఆశీస్సులతో ప్రత్యేక ప్రయోజనాలు పొందనుండటంతో పాటు మీ ఆర్థిక పరిస్థితి కూడా క్రమంగా మెరుగుపడుతుంది. ఉద్యోగులకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. వైవాహిక జీవితం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇవాళ శనీశ్వరుడికి నువ్వులు, బెల్లం దానమివ్వాలి.

కర్కాటకరాశి (Cancer Horoscope)

కర్కాటక రాశి వారికి ఈరోజు మెరుగ్గా ఉండి.. చేసే పనులన్నింట్లో శుభ ఫలితాలుంటాయి. సమాజంలో గౌరవం... వ్యాపారులకు ఈరోజు గణనీయమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉండనుంది. అలాగే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు పొందుతారు.

సింహరాశి (Leo Horoscope)

సింహ రాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయంలో.. బయటి ఆహారం తీసుకోవడంలో అప్రమత్తంగా ఉండాలి. చేసే పనుల్లోనూ కొంత ఆందోళన ఉంటుంది. అయితే ప్రణాళికలను చక్కగా పూర్తి చేస్తే ఫలితం బాగుంటుంది. సమాజంలో గౌరవంతో పాటు ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు లభించే అవకాశాలున్నాయి. ఈ రాశివారు ఈరోజు గురువు లేదా పెద్దల ఆశీస్సులు తీసుకుంటే మంచిది.

కన్య రాశి (Virgo Horoscope)

కన్య రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉండటంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవం, నైపుణ్యాలు పెరుగడంతో పాటు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు సైతం అన్ని విధాలుగా బాగుటుంది. హనుమాన్ చాలీసాను పఠిస్తే మంచిది.

తులారాశి (Libra Horoscope)

తులా రాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసే పనుల్లో నిరాశ, విద్యార్థులకు కొన్ని అడ్డంకులు, ఉద్యోగులకు తమ కార్యాలయంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఈ కాలంలో మీరు చేసే ప్రయణాలు సత్ఫలితాన్నిస్తాయి. ఇవాళ ఈ రాశి వారు శివ చాలీసా పఠిస్తే మంచిది.

వృశ్చిక రాశి (Scorpio Horoscope)

వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా మెరుగ్గా ఉండటతో పాటు పాత స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురైనా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. వ్యాపారవేత్తలు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు నేడు తెల్లని వస్తువులను దానం చేస్తే మంచిది.

ధనస్సు రాశి (Sagittarius Horoscope)

ధనస్సు రాశి వారు ఈరోజు ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీకు అన్నిరంగాల్లో సానుకూల ఫలితాలు.. అని పనుల్లోనూ విజయం సాధిస్తారు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తయి ఆర్థికంగా చాలా బాగుంటుంది. విద్యార్థులకు సైతం ఇవాళ చాలా బాగుంది. ఈ రోజున రావి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగిస్తే మంచిది.

మకర రాశి (Capricorn Horoscope)

మకర రాశి వారు ఈరోజు చాలా సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం లభించినా చేసే పనుల నుంచి కొంత ఒత్తడి ఉంటుంది. ఈరోజు ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. కొందరు ప్రభావవంతమైన వ్యక్తులను కలవడంతో పాటు అనేక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు సైతం నేడు చాలా బాగుంది. ఇవాళ శని చాలీసా పఠిస్తే మంచిది.

కుంభ రాశి (Aquarius Horoscope)

కుంభ రాశి వారికి నేడు ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యాపారులకు అనేక లాభాలు, సమాజంలో గౌరవం, ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. అలాగే ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారు నేడు సరస్వతి దేవిని పూజించాలి.

మీనరాశి (Pisces Horoscope)

మీన రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల కోసం కొంత నాణ్యమైన సమయాన్ని వెచ్చించి సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగులు మీ పనులను అడ్డుంకునేందుకు యత్నిస్తారు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు రానున్నాయి. ఈ రోజున తెల్లని వస్తువులను దానం చేస్తే మంచిది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 10, 2026 3:59 AM