Hardik Pandya: మరో ప్రియురాలితో హార్దిక్ చెట్టాపట్టాల్..!
హార్దిక్ కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను వెదుక్కున్నాడు. హార్దిక్ (Hardik Pandya) మరో మోడల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడంటూ సోషల్ మీడియా (Social Media) కోడై కూస్తోంది. ఆమె పేరు మహీకా శర్మ (Mahika Sharma).

సెర్బియా నటి, మోడల్ నటాషా నుంచి టీమ్‌ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Team India's star all-rounder Hardik Pandya) విడిపోయిన విషయం తెలిసిందే. అయితే అతను కొంత గ్యాప్ తీసుకున్న మీదట ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే.. కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను వెదుక్కున్నాడు. హార్దిక్ (Hardik Pandya) మరో మోడల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడంటూ సోషల్ మీడియా (Social Media) కోడై కూస్తోంది. ఆమె పేరు మహీకా శర్మ (Mahika Sharma). ఆమెతో తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు ఆ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి.. అంటరా? అదే కదా ట్విస్ట్ మరెవరో కాదు.. హార్దిక్ పాండ్యానే తన ఇన్‌స్టా (Hardik Pandya Insta)లో మహీకా (Hardik Pandya with Mahika)తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను స్వయంగా షేర్ చేశాడు. ఆసియా కప్ టీ20 టోర్నీ (Asia Cup T20 tournament)లో గాయపడి, ఫైనల్‌కు హార్దిక్ దూరమైన హార్దిక్ ప్రస్తుతం వైద్యుల సలహాతో విశ్రాంతి తీసుకుంటున్నాడు.