Telagana Govenrment: వాహనదారులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో ఆ పద్ధతికి చెక్..
తెలంగాణ వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనం కొనుగోలు చేసిన వారు దాని రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని నానా తంటాలు పడాలి. ఇక మీదట తెలంగాణ ప్రభుత్వం ఆ పద్ధతికి చెక్ పెట్టేసింది.
తెలంగాణ వాహనదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాహనం కొనుగోలు చేసిన వారు దాని రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకుని నానా తంటాలు పడాలి. ఇక మీదట తెలంగాణ ప్రభుత్వం ఆ పద్ధతికి చెక్ పెట్టేసింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరంలేదు. వాహనం ఎక్కడైతే వాహనం కొనుగోలు చేశారో.. ఆ సంబంధిత డీలరే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనికి సంబంధించిన కొత్త సాఫ్ట్‌వేర్ మరో 15 రోజుల్లో అందుబాటులోకి రానుంది. దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(RC) నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ కొనుగోలుదారు ఇంటికి వస్తుంది. ఈ కొత్త ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుంది.
ఈ ప్రస్తుతం ఈ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్డేషన్ అనేది శరవేగంగా జరుగుతోంది. అది అవగానే తక్షణమే ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఇంతకాలం కొత్త వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రమే షోరూమ్‌లలో జరుగుతూ వస్తోంది. శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కోసం మాత్రం రవాణాశాఖ కార్యాలయాన్ని సందర్వించాల్సిందే. ప్రస్తుతం దీన్ని మార్చి షోరూమ్‌లలోనే జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో వాహనదారులకు చాలా ఊరట లభించనుంది. వాహనదారులకు ఈ ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది. అంతేకాకుండా రవాణాశాఖ కార్యాలయాల్లో వాహన రిజిస్ట్రేషన్ కోసం దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దళారీ వ్యవస్థకు సైతం అడ్డుకట్ట వేయవచ్చు.
వాస్తవానికి ఈ ప్రక్రియ చాలా రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చింది. తెలంగాణలో మాత్రమే ఆలస్యమవుతోంది. కేంద్ర ప్రభుత్వ వాహన్ సారథి పోర్టల్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేరలేదు. దీనిక కారణంగా కూడా ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పుడు ఆ విధానాన్ని అమలులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వాహనదారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఓ మెలిక ఉంది. కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం అధికారిక ఆటోమొబైల్ డీలర్ ద్వారా కొనుగోలు చేసే టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలకు మాత్రమే ఈ కొత్త విధానం వర్తించనుంది. ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు వర్తించదు.