others

గుడ్ న్యూస్.. రేపటి నుంచి అంతా కూల్.. కూల్..!

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. మారుతూ ఉంటాయి. నేను చెప్పేది మీ ఇంటి పరిస్థితుల గురించి కాదండోయ్.. వాతావరణ పరిస్థితుల గురించి..

గుడ్ న్యూస్.. రేపటి నుంచి అంతా కూల్.. కూల్..!

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. మారుతూ ఉంటాయి. నేను చెప్పేది మీ ఇంటి పరిస్థితుల గురించి కాదండోయ్.. వాతావరణ (Climate) పరిస్థితుల గురించి.. గత వారం రోజులుగా బయటకు వెళ్లాలంటేనే భయం.. ఎక్కడ చినుకు పడుతుందో అని .. ఏదో ఆకాశానికి చిల్లు పడిందా.. అన్నట్టుగా వర్షం గుమ్మరించి వదిలిపెడుతోంది. రోడ్లన్నీ జలమయమై పోయి హైదరాబాద్ (Hyderabad) జంట నగరాలు అయితే అల్లాడిపోతున్నాయి. బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి నాలుగు రోజుల పాటు అయితే ఉపశమనం లభించబోతోంది.

రేపటి నుంచి ఆగస్ట్ 18 నుంచి నాలుగు రోజుల పాటు అంటే ఆగస్టు 22 వరకు వాతావరణం గత సంవత్సరం కంటే చల్లగా ఉండబోతోంది. దీన్ని అప్హెలియన్ (Aphelion) ఫినామినాన్ అని అంటారు. ఇది రేపు ఉదయం 5:00 గంటల నుంచి 7:00 గంటల మధ్య ఎప్పుడైనా అప్హెలియన్ ఫినామినాన్ ప్రారంభం కావొచ్చు. ఆసక్తికర విషయం ఏంటంటే.. మనం ఈ అప్హెలియన్ ఫినామినాన్‌ను కేవలం గమనించడమే కాకుండా అనుభవిస్తాము కూడా. కానీ ఆ కూల్‌నెస్ అనేది ఆగస్టు 22, 2025న ముగుస్తుంది. ఏది ఏమైనా శీతాకాలానికి (Winter) ముందే మనం ఒక నాలుగు రోజుల పాటు చల్లదనాన్ని అనుభవించవచ్చన్నమాట.

ఈ అప్హెలియన్ ఫినామినాన్ సమయంలో మునుపెన్నడూ అనుభవించని విధంగా ఉష్ణోగ్రతలు చల్లగా మారిపోవచ్చని శాస్త్రవేత్తలు (Scientists) చెబుతున్నారు. అయితే దీనిలో ఒక సమస్య కూడా ఉంది. దీని కారణంగా శరీర నొప్పులు, గొంతు రాపిడి, జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు. కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిందే. విటమిన్లు, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఉత్తమం. ఇంతకీ ఈ అనుకోని పరిస్థితులకు కారణమేంటో తెలుసా? సాధారణంగా సూర్యుడు, భూమి మధ్య దూరం 90,000,000 కి.మీ. ఉంటుంది. కానీ ఈ అప్హెలియన్ ఫినామినాన్ సమయంలో దూరం బాగా పెరుగుతుంది. దాదాపు ఆ దూరం 66% పెరిగి సూర్యుడు, భూమి మధ్య దూరం 152,000,000 కి.మీ అవుతుంది. అందుకే మనకు ఆ నాలుగు రోజుల పాటు చల్లగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 18, 2025 12:29 PM