others

Horoscope: ఇవాళ ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. కానీ..

నేడు (13 ఏప్రిల్ 2026 రోజున) 12 రాశుల వారికి గ్రహస్థితి ఎలా ప్రభావం చూపుతుందో ఈ రాశి ఫలాలు సూచిస్తాయి. ఇవాళ కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కానీ ఏదో ఒక విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

Horoscope: ఇవాళ ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. కానీ..

నేడు (13 ఏప్రిల్ 2026 రోజున) 12 రాశుల వారికి గ్రహస్థితి ఎలా ప్రభావం చూపుతుందో ఈ రాశి ఫలాలు సూచిస్తాయి. ఇవాళ కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. కానీ ఏదో ఒక విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

మేషం: చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ మీరు నిదానంగా పూర్తి చేస్తారు. సంతానం మీ మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించే అవకాశం ఉంది. దూర ప్రయాణాల్లో వాహన సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఒత్తిడిని పెంచుతాయి. ఆర్థికంగా దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుంది.

వృషభం: ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసిక అసంతృప్తిని కలిగిస్తుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగం మరియు వ్యాపారంలో స్థిరత్వం కొంత తగ్గుతుంది.

మిథునం: ఆర్థిక ఇబ్బందుల నుండి మీరు కొంతవరకు బయటపడతారు. పాత బాకీలు తీరి మనసుకు ఊరట లభిస్తుంది. కొత్త పరిచయాలు ఆర్థిక లాభాలకు దారి తీస్తాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. కుటుంబ సభ్యులతో విభేదాలు పెరిగే అవకాశం ఉంది.

కర్కాటకం: ఒక ముఖ్యమైన విషయంలో ఇంటా బయట సమస్యలు ఎదురవుతాయి. దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉండదు. మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు జరుగుతాయి. సంతాన ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.

సింహం: బంధు మిత్రులతో ఆనందంగా సమయం గడుపుతారు. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు ఉంటాయి.

కన్యా: చుట్టుపక్కల వారితో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. సంతానానికి సంబంధించిన విషయాలు నిరాశ కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఖర్చులు ఆదాయాన్ని మించవచ్చు.

తులా: ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. అవసర సమయంలో సన్నిహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం: దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి విషయాల్లో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నతుల ఆదరణ పెరుగుతుంది.

ధనుస్సు: దైవ అనుగ్రహంతో పనులు సాఫీగా పూర్తవుతాయి. ఉద్యోగంలో వివాదాలు తగ్గే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ప్రయాణాల్లో చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి.

మకరం: కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ అవసరం. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడిని పెంచుతాయి.

కుంభం: ఉద్యోగంలో ఒత్తిడి కొంత తగ్గుతుంది. ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పాత బాకీలు తీరతాయి. వ్యాపారంలో లాభాలు పొందుతారు.

మీనం: సోదరుల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో విజయవంతమైన ఫలితాలు కనిపిస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 13, 2026 2:40 AM