Biggboss: రీతూ ముందు ఊసరవెల్లి కూడా దిగదుడుపే.. ఈవారం ఎలిమినేట్ అయ్యేదెవరంటే..
బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు ఇప్పుడిప్పుడే కాస్త ఆసక్తికరంగా మారుతోంది. దీనికి కారణం.. బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్న రచ్చే. ముఖ్యంగా గత రెండు రోజులుగా రీతూ చౌదరి అయితే మామాలుగా పాపులర్ అవడం లేదు.

బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు (Biggboss season 9 telugu) ఇప్పుడిప్పుడే కాస్త ఆసక్తికరంగా మారుతోంది. దీనికి కారణం.. బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లో జరుగుతున్న రచ్చే. ముఖ్యంగా గత రెండు రోజులుగా రీతూ చౌదరి (Ritu Chowdary) అయితే మామాలుగా పాపులర్ అవడం లేదు. అది నెగిటివ్‌గానే అయినా కూడా ఆమెకు బాగా హైప్ వస్తోంది. ఆమె గేమ్ చూసేవారికి జుగుప్స కలిగిస్తోంది. ఇక డెమాన్ పవన్ (Deman Pawan), పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తో కలిసి ఆమె నడుపుతున్న వ్యవహారం చూస్తుంటే ఆడియన్స్ (Audiance)కు ఆమె అంటేనే అసహ్యం కలిగిస్తోంది. నిన్నటికి నిన్న డెమాన్ పవన్‌ను కెప్టెన్ చేయడం కోసం ఆమె సంచాలక్‌గా ఉండి ఆడించిన గేమ్‌తో ఆమె గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. పైగా తను చేసిందేదో మహాత్కార్యం అన్నట్టుగా ఆమె ఇస్తున్న బిల్డప్ చాలా వరస్ట్. మొత్తానికి నిన్నటి షో మొత్తం రీతూ చౌదరి చుట్టూనే తిరిగింది.
ఇక ఇవాళేమైనా మంచిగా ఉందా? అంటే.. ఇవాళ కూడా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. టెనెంట్స్ నుంచి ఒకరిని బిగ్‌బాస్ (Biggboss) హౌస్‌లోకి పంపించేందుకు టాస్క్ జరిగింది. దీనిలో కూడా రీతూ చౌదరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అసలు ఆమె ఫ్లిప్ అవడం చూస్తుంటే ఊసరవెల్లి సైతం ఆమె ముందు దిగదుడుపేనని అనిపిస్తోంది. మొత్తానికి ఇవాళ (శనివారం) రీతూ చౌదరికి హోస్ట్ నాగార్జున (Host Nagarjuna) గట్టిగానే క్లాస్ పీకే అవకాశం ఉంది. ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కామనర్స్ నుంచే ఎలిమినేషన్ ఉంటుందనేదనడంలో సందేహం లేదు. వీరిలో ప్రియ (Priya Shetty), మర్యాద మనీష్ (Maryada Manish)లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. దాదాపుగా మనీష్ ఎలిమినేట్ అవుతాడని తెలుస్తోంది.