Biggboss9: డ్రామా కింగ్ ఇమ్మాన్యుయేల్.. అవసరానికో మాట..
ఇన్ని విషయాలను అర్థం చేసుకున్న ప్రేక్షకులు తను ఏడిస్తే మాత్రం అది డ్రామా అని కనిపెట్టేస్తారని అర్థం చేసుకోకపోవడం ఆసక్తికరం.

ఈసారి బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu)లో అంతా ముదుర్లే ఉన్నారు. అంతా బిగ్‌బాస్ షోలన్నింటినీ పిన్ టు పిన్ చూసి ఆకళింపు చేసుకుని మరీ వచ్చారు. దానికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే నాటకాలాడుతున్నారు. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరి డ్రామా బయటపడుతోంది. తాజాగా ఇమ్మాన్యుయేల్ డ్రామా బయటపడింది. వాస్తవానికి హౌస్ (Biggboss House)లో అందరి కంటే కూడా ఇమ్మాన్యుయేల్ (emmanuel) తెలివైన వాడు. ఏం జరిగినా అది ఎందుకు జరుగుతుందనేది సరిగ్గా అంచనా వేయగలడు. అలాంటి వ్యక్తికి సంజనా గర్లానీ (Sanjana Garlani)ని సీక్రెట్ రూమ్‌కి పంపిస్తున్నారని తెలియదా? పక్కాగా తెలుసు. పైగా అందరూ సీక్రెట్ రూం (Biggboss Secret Room)కి పంపిస్తున్నారని అక్కడే చెప్పుకున్నారు.
అలాంటిది ఇమ్మాన్యుయేల్ అయితే ఓవర్ డ్రామా క్రియేట్ చేశాడు. ఏడ్చి గగ్గోలు పెట్టి హై డ్రామా క్రియేట్ చేశాడు. అదంతా ఫేక్ అని పక్కాగా బిగ్‌బాస్ (Biggboss) ప్రేక్షకులకు అర్థమైంది. ఇన్ని విషయాలను అర్థం చేసుకున్న ప్రేక్షకులు తను ఏడిస్తే మాత్రం అది డ్రామా అని కనిపెట్టేస్తారని అర్థం చేసుకోకపోవడం ఆసక్తికరం.ఒకరకంగా చెప్పాలంటే.. ఎంత తెలివైన వాడు అయినా కూడా ఎక్కడో ఒకచోట బోల్తా పడతాడు అంటారే అది ఇదేనేమో.. ఇక సంజనాను నాగార్జున (Host Nagarjuna).. స్టేజ్ మీదకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇమ్మూ డ్రామా కంటిన్యూ. నాలుగు రోజుల క్రితమేమో.. భరణి (Actor Bharani)తో ‘నువ్వా.. అమ్మా (సంజన)? అంటే నేను నీ పేరే చెబుతా అన్నా’ అన్నాడు. ఇప్పుడు 14 మంది ఒకటి.. సంజన ఒకటి అంటూ చెప్పేశాడు. మాటను సమయానుసారంగా.. అవసరానికి తగ్గట్టుగా ఇమ్మాన్యుయేల్ మార్చేశాడు. ఇంతకు మించిన డ్రామా కింగ్ ఉంటాడా?
ప్రజావాణి చీదిరాల