others

Biggboss: బిగ్‌బాస్ ఫేంలు తిరుమలకు వెళ్లి కుదురుగా రారా? రోజుకో రచ్చ.. తాజాగా దివ్వెల మాధురి, తనూజ

మొన్న శివజ్యోతి.. నిన్న గీతూ రాయల్.. ఇక తాజాగా దివ్వెల మాధురి, తనూజ.. అంతా బిగ్‌బాస్ ఫేమ్‌లే.. వీళ్లకు ఏమైందో ఏమో కానీ తిరుమలకు వెళితే కుదురుగా తిరిగి రావడం లేదు. శివజ్యోతి ఏకంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే అపహాస్యం చేసింది.

Biggboss: బిగ్‌బాస్ ఫేంలు తిరుమలకు వెళ్లి కుదురుగా రారా? రోజుకో రచ్చ.. తాజాగా దివ్వెల మాధురి, తనూజ

మొన్న శివజ్యోతి.. నిన్న గీతూ రాయల్.. ఇక తాజాగా దివ్వెల మాధురి, తనూజ.. అంతా బిగ్‌బాస్ ఫేమ్‌లే.. వీళ్లకు ఏమైందో ఏమో కానీ తిరుమలకు వెళితే కుదురుగా తిరిగి రావడం లేదు. శివజ్యోతి ఏకంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్నే అపహాస్యం చేసింది. వెకిలిగా నవ్వుతూ రిచ్ బెగ్గర్స్ అంటూ నానా హంగామా చేసింది. ఇక ఆ తరువాత గీతూ రాయల్.. ఏకంగా తన టీంతో శ్రీవారి రచ్చ చేసింది. రీల్ చేసి నానా హంగామా చేసింది. ఇక తాజాగా దివ్వెల మాధురి తనూజ వంతు. తిరుమలలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం విరుద్ధం. కానీ ఇద్దరూ కేక్ కట్ చేసి మరీ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దివ్వెల మాధురి, తనూజ అనే ఇద్దరు వ్యక్తులు నిన్న తిరుమలలో బర్త్ డే వేడుకలు చేసుకున్నారు. ఈ విషయం తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి సైతం పలువురు భక్తులు తీసుకెళ్లారు. వాస్తవానికి తిరుమలలో ఇలాంటి వేడుకలు చేసుకోవడం పూర్తిగా నిషేధించడం జరిగింది. అయినా కూడా ఈ వేడుకలు నిర్వహించారు. పైగా ఆ వీడియో చిత్రీకరించి సోషియల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై టీటీడీ స్పందించింది. ఇది సరైన పద్ధతి కాదని స్పష్టం చేసింది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే టీటీడీ విజిలెన్స్ పోలీసులుకు సైతం ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు సదరు ఘటనపై విచారణ వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

వరుస ఘటనలు జరుగుతున్నాయి. అయినా కూడా ఎందుకు వీళ్లకు అర్థం కావడం లేదు. తిరుమలకు వెళ్లినప్పుడు ఎలా ఉండాలో వీరికి తెలియడం లేదా? లేదంటే.. సెలబ్రిటీలం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే భావనలో ఉన్నారా? ఒక్కొక్కరూ ఒక్కో తీరుగా బుక్ అవుతున్నారు. వీడియోలు తీసుకుని వాటిని ప్రపంచానికి తెలియజేసి గొప్పలకు పోయి తిప్పలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ మూడు ఘటనలు చూసిన తర్వాత అయినా ఈ చోటా సెలబ్రిటీలు తగ్గుతారేమో చూడాలి. కొంచెం ఫేమ్ వచ్చీరాగానే తామేం చేసినా చెల్లుతుందనే భావన నుంచి బయటకు వస్తే బాగుంటుందని నెటిజన్లు అంటున్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 7, 2026 2:30 AM