NALSAR Universiy of Law: నల్సర్‌లో ఏఐ వినియోగంపై సదస్సు..
యువ పారిశ్రామికవేత్తలకు కృత్రిమ మేధస్సు (AI)కు సంబంధించిన ప్రాయోగిక జ్ఞానం, ఆధునిక సాధనాలను పరిచయం చేసి, పని ప్రదేశంలో ఉత్పాదకతను పెంచడం అలాగే వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించే విధానాలను నేర్పించడం లక్ష్యం.
జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రో (National Institute of Micro).. స్మాల్ అడ్ మీడియం ఎంటర్ (Small and Medium Enterprises) (ni-msme), నల్సర్ (NALSAR University of Law)లోని మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం (DoMS) తో కలిసి “పని ఉత్పాదకత, వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కృత్రిమ మేధస్సు (AI) వినియోగం” అనే శీర్షికతో ఐదు రోజుల అడ్వాన్స్‌డ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం మార్చి 11 నుంచి మార్చి 17 వరకూ శామీర్‌పేట్, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా ప్రాంగణంలో నిర్వహించబడుతోంది.
ఈ కార్యక్రమం ద్వారా యువ పారిశ్రామికవేత్తలకు కృత్రిమ మేధస్సు (AI)కు సంబంధించిన ప్రాయోగిక జ్ఞానం, ఆధునిక సాధనాలను పరిచయం చేసి, పని ప్రదేశంలో ఉత్పాదకతను పెంచడం అలాగే వ్యాపార కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించే విధానాలను నేర్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. వివిధ రంగాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి నమోదు చేసుకొని శిక్షణా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ శిక్షణలో భాగంగా వ్యాపార కార్యకలాపాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలను ఎలా అనుసంధానించుకోవాలి. పనితీరును ఎలా సులభతరం చేయాలి. అలాగే డేటా ఆధారిత నిర్ణయాలు ఎలా తీసుకోవాలి వంటి అంశాలపై ప్రాయోగిక అవగాహన కల్పిస్తున్నారు. దీని ద్వారా సంస్థల సామర్థ్యం, ఉత్పాదకతను మెరుగుపరచుకోవడానికి అవసరమైన నైపుణ్యాలను పాల్గొనేవారికి అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి డా. ఏ సాయి కిరణ్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మేనేజ్‌మెంట్ స్టడీస్ విభాగం, నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.