BSNL: దీపావళి సందర్భంగా బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్..
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దీపావళి (Diwali) సందర్భంగా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి బొనాంజా’ (BSNL Diwali Bonanza) పేరిట చేసిన ప్లాన్‌లో భాగంగా..

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) దీపావళి (Diwali) సందర్భంగా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘బీఎస్‌ఎన్‌ఎల్ దీపావళి బొనాంజా’ (BSNL Diwali Bonanza) పేరిట చేసిన ప్లాన్‌లో భాగంగా రూ.1కే అపరిమిత సేవలను బీఎస్ఎన్ఎల్ అందించనుంది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తించనుంది. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్ (X) వేదికగా పోస్ట్ చేసింది. ఈ ఆఫర్ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకూ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని.. కొత్త వినియోగదారులంతా దీనిని వినియోగించుకోవాలని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.
ఈ ప్లాన్‌లో భాగంగా రూ.1కే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ (Unlimited Voice Calls)ను అందించనుంది. అంతేకాకుండా.. రోజుకు 2 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను బీఎస్‌ఎన్ఎల్ అందించనుంది. సిమ్ కోసం కూడా డబ్బు ఏమీ చెల్లించక్కర్లేదు. ఫ్రీగానే అందించనుంది. ఆసక్తి గల వినియోగదారులు ఈ ఆఫర్ కోసం సమీపంలోని బీఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) లేదా రిటైలర్‌ను సందర్శించవచ్చు. ఇప్పటికే ఇతర సంస్థలు మెసేజ్‌లకు సైతం డబ్బు డిమాండ్ చేస్తున్నాయి. అది మాత్రమే కాకుండా ప్లాన్ ముగిసీ ముగియక ముందే అవుట్ గోయింగ్‌తో పాటు ఇన్ కమింగ్ కాల్స్‌ను కూడా ఆపేస్తున్నాయి. ఈ క్రమంలోనే వినియోగదారులంతా బీఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు.