others Breaking News

మార్గదర్శి శైలజాకిరణ్ పూజాపీఠానికి పురాణపండ శ్రీమాలిక పంపిన బొల్లినేని

అద్భుత మంత్ర శక్తులు, మంత్ర రహస్యాలు, మంత్ర విశేషాలతో రూపొందిన గ్రంథం శ్రీమాలిక. నాలుగు వందల పేజీల ఈ శ్రీమాలికను పురాణపండ శ్రీనివాస్ తీర్చిద్దారు.

మార్గదర్శి శైలజాకిరణ్ పూజాపీఠానికి పురాణపండ శ్రీమాలిక పంపిన బొల్లినేని

అద్భుత మంత్ర శక్తులు, మంత్ర రహస్యాలు, మంత్ర విశేషాలతో రూపొందిన గ్రంథం శ్రీమాలిక. నాలుగు వందల పేజీల ఈ శ్రీమాలికను పురాణపండ శ్రీనివాస్ తీర్చిద్దారు. మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ ఆవిర్భావ ఘట్టంతో శ్రీమాలిక రూపుదిద్దుకుంది. తెలుగు రాష్ట్రాలలో అప్రతిహతంగా ఇది దూసుకెళుతోంది. ఇలా ఈ గ్రంథం దూసుకెళ్లడంలో కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సైతం చాలా కృష్టి చేశారు. ఈ క్రమంలోనే బొల్లినేని సౌజన్య హృదయాన్ని, పురాణపండ శ్రీనివాస్ అసాధారణ నిర్విరామ కృషిని, పవిత్ర సొగసుల శైలిని ఎందరెందరో పీఠాధిపతులు, మఠాధిపతులు, సాహిత్యవేత్తలు, ఘనాపాఠీలు, భక్తపాఠకులు వేనోళ్ళ ప్రశంసలు వర్షిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, తొలిసారి ఉపముఖ్యమంత్రి హోదాలో అపూర్వ సేవలందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషిని గుర్తిస్తూ.. వీరి ఫోటోలను శ్రీమాలిక వెనుక ముద్రించడం జరిగింది. ఈ క్రమంలోనే శ్రీమాలిక ప్రతులను అటు అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాలలోని ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు బొల్లినేని కృష్ణయ్య పంచి ప్రశంసలు పొందడం విశేషం. అలాగే చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల చిత్రాలతో ప్రచురించిన శ్రీమాలిక ప్రతులను తిరుపతి, కుప్పం, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, శ్రీశైలం వంటి ప్రాంతాలలో టీడీపీ శ్రేణులకు ఉచితంగా సమర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని వేల వేల కార్యకర్తల పూజా పీఠాలకు సైతం చేర్చడం జరిగింది. ఇలా చేర్చిన ఘనత బొల్లినేని కృష్ణయ్యదేనని పార్టీలో అగ్రనేతలు సైతం అభినందిస్తున్నారు.

జూబిలీ హిల్స్ రామాలయంలో జరిగిన ఒక అపురూప పవిత్ర శ్రీకార్యంలో మార్గదర్శి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త శ్రీమతి శైలజాకిరణ్ పాల్గొన్నారు. ఆమెకు కూడా బొల్లినేని కృష్ణయ్య అపురూప జ్ఞాపికగా పురాణపండ శ్రీనివాస్ పవిత్ర కదంబ పరిమళం శ్రీమాలిక గ్రంథాన్ని సంతోషంగా బహూకరించడం అక్కడి వారందరి దృష్టినీ ఆకర్షించింది. ఇటీవల హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో కూడా శ్రీమాలిక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. బుక్ ఫెయిర్‌లో అగ్రస్థానంలో మేధావి వర్గాన్ని శ్రీమాలిక విశేషంగా ఆకట్టుకుందని మీడియా సైతం కోడై కూసింది. ఇదే సమయంలో అక్కడి రామాలయ వేదపాఠశాల వేదపండిత, ఆచార్య, విద్యార్థి వర్గాలకు సైతం బొల్లినేని కృష్ణయ్య ఈ దివ్య గ్రంథాలను బహూకరించడం జరిగింది. 

ఋషుల పరంపరను చెక్కు చెదరకుండా ఆర్షగ్రంథాల రచనా, సంకలనాల ద్వారా అమోఘ గ్రంథాలను పురాణపండ శ్రీనివాస్ అందిస్తున్నారు. తన జీవన యాత్రలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా ఎప్పుడూ కూడా దైవీయ స్పృహతో సంచరిస్తూ తానే ఒక మంత్రాక్షరంగా దైవబలంతో పురాణపండ శ్రీనివాస్ వెలుగులీనుతున్నారు. అలాగే 
బొల్లినేని కృష్ణయ్య చేసిన నిర్మాణాత్మక రాజకీయ వైద్య సేవలు ఒక ఎత్తని చెప్పాలి. మరోవైపు శ్రీమాలిక ఆధ్యాత్మిక నిస్వార్ధ సేవ చరిత్రకెక్కడం ఖాయమని టీడీపీ శ్రేణులు ముక్త కంఠంతో అభినందనలు తెలియజేస్తున్నాయి.

కొన్ని ముఖ్య సభల్లో, సమావేశాల్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి పర్యవేక్షణలో శ్రీమాలిక బుక్స్ పంపిణీ చేసినట్టు ఆయా ప్రాంతాలకు చెందిన టీడీపీ శ్రేణులు ఆనందంగా తెలియజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు కార్యాలయంలో సైతం పత్రికలు ఉంచే చోట సైతం నాలుగైదు శ్రీమాలిక గ్రంథాలు ఎదురుగా ఉంటాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీనిని బట్టి ఎంతోమంది మంత్రులు, రాజకీయ ప్రముఖులు నిత్యం వాటిని చూస్తుంటారని స్పష్టంగా తెలుస్తోంది.  హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ సైతం గతంలో తన నియోజక వర్గంలో కొన్ని ముఖ్య కార్యాలయాలకు శ్రీమాలిక బుక్స్ అందించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 4, 2026 12:03 PM