Biggboss9: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కల్యాణ్ పడాల.. వాటే జర్నీ..
గత వారమంతా ఓటింగ్‌లో కల్యాణ్ పడాల తన సత్తా చాటాడు. డీమాన్ పవన్, రీతూతో నామినేషన్స్ సందర్భంగా జరిగిన వాగ్వాదం అతని గ్రాఫ్‌ను అనూహ్యంగా పెంచేసింది. 11 వారాల పాటు ఓటింగ్‌లో టాప్‌లో ఉన్న తనూజను దాటి మరీ నంబర్ 1 స్థానంలో నిలిచాడు.
బిగ్ బాస్9 తెలుగు (Biggboss 9 Telugu) దాదాపుగా ఫైనల్‌కు వచ్చేసింది. ప్రస్తుతం హౌస్‌లో కల్యాణ్ పడాల (Kalyan Padala), తనూజ పుట్టస్వామి (Tanuja Puttaswamy), ఇమ్మాన్యుయేల్ (Emmanuel), భరణి (Bharani), సుమన్ శెట్టి (Suman Shetty), సంజన గల్రానీ (Sanjana Garlani), రీతూ చౌదరి (Rithu Chowdary), డీమాన్ పవన్ (Deeman Pawan) ఉన్నారు. గత వారమంతా ఓటింగ్‌లో కల్యాణ్ పడాల తన సత్తా చాటాడు. డీమాన్ పవన్, రీతూతో నామినేషన్స్ సందర్భంగా జరిగిన వాగ్వాదం అతని గ్రాఫ్‌ను అనూహ్యంగా పెంచేసింది. 11 వారాల పాటు ఓటింగ్‌లో టాప్‌లో ఉన్న తనూజను దాటి మరీ నంబర్ 1 స్థానంలో నిలిచాడు. అదొక్కటే కాదు.. ఆ తరువాత బిగ్‌బాస్ హౌస్‌కు ఫైనల్ కెప్టెన్ సైతం అయ్యాడు. దీంతో కల్యాణ్ పడాల ట్విట్టర్‌లోనూ ప్రభంజనం సృష్టిస్తున్నాడు.
నెటిజన్లు కల్యాణ్ పడాలకు అనుకూలంగా రెండున్నర లక్షలకు పైగా ట్వీట్లను పెట్టడంతో అతను జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యాడు. దీంతో బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ అయిన పవన్ కల్యాణ్ ఒక్కసారిగా సోషల్ మీడియా స్టార్ అయ్యాడు. అంతేకాకుండా దాదాపుగా రెండున్నర లక్షల ఎంగేజ్‌మెంట్‌లను దాటి మరీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఈ ట్రెండ్ అనేది చాలా గంటల పాటు యాక్టివ్‌గా ఉండటం విశేషం. కొన్ని వారాల పాటు తనూజ చుట్టూ నడిచిన బిగ్‌బాస్ షో.. ఇప్పుడు ఎండింగ్‌కు వచ్చేసరికి సీన్ మారిపోయింది. జనాల ఫోకస్ పూర్తిగా కల్యాణ్ పడాల తన వైపునకు తిప్పుకున్నాడు.
కల్యాణ్ పడాల ఆది నుంచి కూడా చాలా జెన్యూన్ కంటెస్టెంట్‌గా ఉండటమే దీనికి ప్రధాన కారణం. దీంతో పాటు ఫ్యామిలీ వీక్‌లో కల్యాణ్ తండ్రి వచ్చి చెప్పిన మాటలు సైతం అతని గ్రాఫ్‌ను బీభత్సంగా పెంచేశాయి. వాస్తవానికి కల్యాణ్ పడాల కుటుంబం రోజు గడవడానికే కష్టపడిన స్థాయి నుంచి ప్రస్తుతం కాస్త కోలుకున్నారు. ఒకరకంగా చెప్పాలంటే దిగువ మధ్యతరగతి. అలాంటి కుటుంబ పెద్ద వచ్చినప్పుడు సర్వసాధారణంగా కప్ కొట్టాలని చెబుతారు. కానీ కల్యాణ్ పడాల తండ్రి మాత్రం కప్ ముఖ్యం కాదు.. నీతినిజాయితీలే ముఖ్యమని చెప్పి అతడిని కప్‌కు దగ్గర చేసి మరీ వెళ్లారు. మరో మూడు వారాల్లో గ్రాండ్ ఫినాలే ఉందనగా.. సోషల్ మీడియా మొత్తం కల్యాణ్ పడాల చుట్టే తిరగడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. ఇంతకు మించిన జర్నీ మరొకటి ఉండదేమో..
ప్రజావాణి చీదిరాల