others

Biggboss9: దారుణం.. రీతూని కాపాడటం కోసం బిగ్‌బాస్ బిగ్ గేమ్..

బిగ్‌బాస్ దారుణమైన అన్ ఫెయిర్ చేశాడు. ఒక్కసారిగా సోషల్ మీడియా (Social Media)లో పెద్ద ఎత్తున బిగ్‌బాస్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఈవారం ఎలిమినేషన్.

Biggboss9: దారుణం.. రీతూని కాపాడటం కోసం బిగ్‌బాస్ బిగ్ గేమ్..

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggbboss 9 Telugu) దారుణంగా మారింది. ఇప్పటివరకూ బిగ్‌బాస్ (Biggbboss) చాలా జెన్యూన్‌గా నడుస్తోందన్న భావన ప్రేక్షకుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఎలిమినేట్ (Biggboss Elemination) అయిన వారందరిదీ చాలా జెన్యూన్‌గానే జరగడంతో అంతా ఈసారి బిగ్‌బాస్ చాలా బాగుందన్న భావన వస్తోంది. ఇలాంటి తరుణంలో బిగ్‌బాస్ దారుణమైన అన్ ఫెయిర్ చేశాడు. ఒక్కసారిగా సోషల్ మీడియా (Social Media)లో పెద్ద ఎత్తున బిగ్‌బాస్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఈవారం ఎలిమినేషన్. ఈ వారం శ్రీజ ఎలిమినేట్ (Srija Eliminate) అయ్యింది. రీతూ చౌదరి (Rithu Chowdary)ని కాపాడటం కోసం బిగ్‌బాస్ కావాలని శ్రీజను ఎలిమినేట్ చేశారనేది ప్రధాన విమర్శ. వాస్తవానికి శ్రీజకు మంచి ఓటింగే ఉంది. రీతూ ఓటింగ్ పరంగా చాలా లీస్ట్‌లో ఉంది.

వాస్తవానికి ఈసారి జనాల ఓట్లను పరిగణలోకి తీసుకోలేదు. టాస్క్‌లను బట్టి ఎలిమినేట్ చేయడం దారుణమని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఈసారి రీతూని కాపాడటం కోసం శ్రీజను ఎలిమినేట్ చేయడం మరింత విమర్శలకు దారి తీస్తోంది. శ్రీజ ఈవారం టాస్క్‌లు అద్భుతంగా ఆడింది. అసలు ఈ వారమే కాదు.. ప్రతి వారం శ్రీజ టాస్క్‌లు చాలా బాగా ఆడుతూ ఉంటుంది. ఆమెకు నోరు కొంచెం ఎక్కువ. అయితే దివ్య నికిత (Divya Nikitha) వచ్చి చెప్పినప్పటి నుంచి నోటిని కూడా అదుపులో పెట్టుకుంది. పాయింట్ ఉంటేనే మాట్లాడుతోంది. పైగా ప్రియ (Priya Shetty) బయటకు వెళ్లినప్పటి నుంచి శ్రీజలో చాలా మార్పు వచ్చింది. రీతూ ప్రస్తుతం డెమాన్ పవన్‌ (Demon Pawan)తో లవ్ ట్రాక్ నడుపుతోంది. రీతూ వెళ్లిపోతే ఎక్కడ లవ్ ట్రాక్ (Love Track In Biggboss House) పోతుందోనని భయపడి ఆటనంతా మార్చేసి ప్రేక్షకులు వేసిన ఓట్లను పక్కనబెట్టి శ్రీజను బిగ్‌బాస్ ఎలిమినేట్ చేసినట్టు అంతా భావిస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 11, 2025 3:32 PM