others

Gold Price: వామ్మో ఈ పరుగేంటి? బంగారం, వెండి ధరలకు హద్దులే లేవా?

బంగారం, వెండి ధరల పరుగు ఆపడమే లేదు. బుధవారం చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఈ బంగారం, వెండి ధరలు పరుగులు తీశాయి. గరిష్ఠ స్థాయిలను బంగారం, వెండి ధరలు చేరడం విస్మయాన్ని కలిగించింది.

Gold Price: వామ్మో ఈ పరుగేంటి? బంగారం, వెండి ధరలకు హద్దులే లేవా?

బంగారం, వెండి ధరల పరుగు ఆపడమే లేదు. బుధవారం చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఈ బంగారం, వెండి ధరలు పరుగులు తీశాయి. గరిష్ఠ స్థాయిలను బంగారం, వెండి ధరలు చేరడం విస్మయాన్ని కలిగించింది. అమెరికా డాలర్ బలహీనత, గ్రీన్‌లాండ్ సంక్షోభంతో పాటు జపాన్ ప్రభుత్వ బాండ్ల మార్కెట్‌లో ఏర్పడిన సంక్షోభం కూడా తోడవడంతో ఇన్వెస్టర్స్ అంతా బంగారం, వెండి పెట్టుబడులపై మొగ్గుచూపారు. వెరసి బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. ఇప్పటికే 24 క్యారెట్ల బంగారం ధర లక్షన్నర దాటేయగా.. బుధవారం మరింత పెరిగింది.

హైదరాబాద్‌ మార్కెట్‌లో ఈ ఉదయం పసిడి ధర ఏకంగా రూ. 1,61,100 పలికింది. మంగళవారంతో పోలిస్తే దాదాపు రూ. 9000 పైగా పెరగడం విశేషం. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,41,900 చేరింది. అయితే ఇవాళ బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. బంగారం ధర హైదరాబాద్‌లో 24 క్యారెట్లు రూ.1,56,610 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,560గా ఉంది. ఇక నిన్న ఉదయం కిలో వెండి ధర రూ. 3,30,000 ఉండగా.. ఇవాళ కాస్త తగ్గి రూ.3,17,160గా ఉంది. మొత్తానికి బంగారం, వెండి అనేవి ఇన్వెస్టర్లకు అత్యంత నమ్మకమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా మారడంతో వీటిపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 22, 2026 2:58 AM