Biggboss9: కల్యాణ్ పడాల విన్నర్ అవడానికి రీతూ, పవన్‌లే కారణమా?
బిగ్‌బాస్ 9 తెలుగు ముగిసింది. ఈసారి పెద్ద ఎత్తున టీఆర్పీలు వచ్చాయి. షో బంధాలతో బీభత్సంగా నడిచింది. ఈసారి ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర. చివరకు జరగాల్సిన వారికే న్యాయం జరిగింది. టాప్ 5లో కల్యాణ్ పడాల, తనూజ, డెమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఉన్నారు.
బిగ్‌బాస్ 9 తెలుగు ముగిసింది. ఈసారి పెద్ద ఎత్తున టీఆర్పీలు వచ్చాయి. షో బంధాలతో బీభత్సంగా నడిచింది. ఈసారి ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర. చివరకు జరగాల్సిన వారికే న్యాయం జరిగింది. టాప్ 5లో కల్యాణ్ పడాల, తనూజ, డెమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఉన్నారు. సంజన ముందుగా ఎలిమినేట్ అవగా.. తరువాత ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యాడు.
రన్నర్ అవడానికి బీజం పడిందక్కడే..
ఆది నుంచి విన్నర్ మెటీరియల్‌గా తనూజ మారింది. ప్రతి వారం బిగ్‌బాస్ టీం కూడా ఆమెకు బీభత్సమైన హైప్ ఇచ్చింది. ఆమె కూడా అందరి సపోర్ట్ తీసుకుని ముందుకు సాగింది. కానీ ఎవరూ తనకు సపోర్ట్ ఇవ్వలేదనడం నుంచి ఆమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. విన్నర్ మెటీరియల్ కాస్త రన్నర్ మెటీరియల్ అవడానికి బీజం పడింది అక్కడే. తనకు ఎవరైతే ప్రతిసారీ సాయంగా నిలిచారో వారికి అవసరమైనప్పుడు తన సాయాన్ని అందించలేదు. చక్కగా హ్యాండ్ ఇచ్చింది. ఇవన్నీ తనూజ బిగ్ మైనస్. పైగా ఎందుకో చెప్పలేనంత నెగిటివిటి. కారణాలు కూడా ఇవే కావొచ్చు. భరణిని నాన్న.. నాన్న అంటూ ఆయన చుట్టూ తిరిగి ఎక్కడలేని సపోర్ట్ తీసుకుని చివరకు ఆయనకే వెన్నుపోటు పొడిచింది. భరణిని ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్‌కు అలా దూరమైపోయింది.
అక్కడి నుంచి పెరిగిన కల్యాణ్ గ్రాఫ్..
ఇక పవన్ కల్యాణ్ పడాల విషయానికి వస్తే 9వ వారం వరకూ కల్యాణ్ పెద్దగా హైలైట్ అవలేదు. అక్కడి నుంచి అతని గ్రాఫ్ పెరిగింది. పవన్, రీతూ చౌదరి కూడా కల్యాణ్ గ్రాఫ్ పెరగడానికి ఒక కారణమని చెప్పాలి. ఒక టాస్క్‌లో పవన్‌కు చెప్పి ముందుగా కల్యాణ్‌ను రీతూ తీయించేసింది. ఆ వారం కల్యాణ్ గ్రాఫ్ బీభత్సంగా పెరిగింది. కల్యాణ్‌కు బీభత్సమైన సింపతీ వర్కవుట్ అయ్యింది. ఆ తరువాతి నుంచి కల్యాణ్ గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఫ్యామిలీ వీక్‌లో కల్యాణ్ తండ్రి వచ్చి కూడా ఆయన గ్రాఫ్‌ను అమాంతం పెంచేశారు. కల్యాణ్ తండ్రి మాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. చివరకు తనూజపై ఉన్న నెగిటివిటీ కూడా తోడవడంతో కల్యాణ్ పడాల విన్నర్ అయిపోయాడు. ముఖ్యంగా ప్రేక్షకులు కల్యాణ్‌ను బాగా దగ్గరకు తీసుకున్నారు.
రీతూ కోసమే గేమ్..
ఇక టాప్ 3లో ఉన్న డెమాన్ పవన్ విషయానికి వస్తే.. రీతూ ఎలిమినేట్ అవనంత వరకూ టాస్క్‌ల్లో అతడిని కొట్టేవాడు లేకున్నా.. అందరికీ విసుక్కోకుండా వండిపెట్టినా కూడా ఏమాత్రం మైలేజ్ రాలేదు. కేవలం రీతూ కోసమే టాస్క్ ఆడుతున్నాడన్న అపవాదును సైతం మోశాడు. అపవాదు కూడా కాదు.. చాలా వరకూ అది నిజమే. ఎన్నో సార్లు రీతూ కోసమే అతను గేమ్ ఆడాడు. దీంతో డెమాన్ పవన్ కావల్సినంత నెగిటివిటీని మూటగట్టుకున్నాడు. రీతూ వెళ్లిపోయాక అతను చాలా యాక్టివ్ అయిపోయాడు. అతనిలో సెన్స్ ఆఫ్ హ్యూమర్ బయటకు వచ్చింది. మొత్తానికి రీతూ ఉన్నంత కాలం ఏ క్షణమైనా ఎలిమినేట్ అవ్వొచ్చేమో అనుకున్న వ్యక్తి.. టాప్ 3కి చేరడమనేది ఆసక్తికరం.
అన్నీ ఉన్నా..
బిగ్‌బాస్ హౌస్‌లో దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే.. అది ఇమ్మాన్యుయేల్. తను చక్కగా ఆది నుంచి నామినేషన్స్‌లోకి వచ్చి ఉంటే పక్కాగా విన్నర్ అయి ఉండేవాడు. నామినేషన్స్‌కి భయపడిపోవడంతో తన ఆటను తనే చెడగొట్టుకున్నాడు. ఇమ్ము లేకుంటే హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంటే లేదు. ఒకరకంగా చెప్పాలంటే సీజన్ 9 నడిచిందే ఇమ్మూ కారణంగా.. టాస్క్‌ల్లో సైతం అతను కింగే. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా.. ఒక్క నామినేషన్స్‌లోకి రాకుండా ఓటు బ్యాంకును కోల్పోయాడు. అలా నాలుగో స్థానంతో ఇమ్మూ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 10 వారాల పాటు నామినేషన్స్‌లోకి రాకున్నా కూడా టాప్ 4లో ఉండటం విశేషమనే చెప్పాలి. అది ఇమ్మూకి మాత్రమే సాధ్యమైంది.
ప్రజావాణి చీదిరాల