AP EAMCET: ఫైనల్ కౌన్సెలింగ్ నేడే.. అధికారిక వెబ్‌సైట్‌లో సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెప్టెంబర్ 20న మూడవ, చివరి దశకు సంబంధించిన కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాన్ని విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) సెప్టెంబర్ 20న మూడవ, చివరి దశకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయం, వైద్య సాధారణ ప్రవేశ పరీక్ష (AP EAMCET) 2025 కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాన్ని విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ - eapcet-sche.aptonline.in సీట్ల కేటాయింపు ఫలితాన్ని అందుబాటులో ఉంచింది. అభ్యర్థి మెరిట్ ర్యాంక్, వర్గం (ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ పీడబ్ల్యూడీ/ ఎన్‌సీసీ/ సీఏపీ/ స్పోర్ట్స్, గేమ్స్ కోటా మొదలైనవి) పరిగణనలోకి తీసుకుని, ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా ఏపీ ఎంసెట్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
షెడ్యూల్ చేసిన తేదీన సీట్ల అలాట్‌మెంట్ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురించబడతాయి. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలన్నీ అభ్యర్థి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడతాయి. సీట్ల అలాట్‌మెంట్ రిజల్ట్ ప్రకటించిన తర్వాత, అభ్యర్థులు సెప్టెంబర్ 23 నాటికి కేటాయించిన కళాశాలల్లో చేరి రిపోర్ట్ చేయాలి. అయితే, తరగతులు సెప్టెంబర్ 20 నుండి ప్రారంభమవుతాయి. కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేసుందుకు గాను సెప్టెంబర్ 23 వరకూ గడువు ఉంది. తరగతులు మాత్రం నేటి (సెప్టెంబర్ 20) నుంచే ప్రారంభమవుతాయి.