others

Amazon: 30 వేల మందిపై వేటు వేసేందుకు సిద్ధమైన అమెజాన్..!

ప్రముఖ సంస్థలన్నీ తమ సంస్థ ఉద్యోగులకు వేటు వేస్తూనే ఉన్నారు. ఇప్పటికే తన ఉద్యోగులపై వేటు వేసిన ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు (layoffs) వేసేందుకు సిద్ధమైంది.

Amazon: 30 వేల మందిపై వేటు వేసేందుకు సిద్ధమైన అమెజాన్..!

ప్రముఖ సంస్థలన్నీ తమ సంస్థ ఉద్యోగులకు వేటు వేస్తూనే ఉన్నారు. ఇప్పటికే తన ఉద్యోగులపై వేటు వేసిన ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు (layoffs) వేసేందుకు సిద్ధమైంది. ఒక వెయ్యి లేదంటే రెండు వేల మందిపై కాదు... ఈసారి ఏకంగా 30వేల మంది కార్పొరేట్‌ ఉద్యోగులను తొలగించాలని యోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు పెద్ద ఎత్తున కథనాలు వినవస్తున్నాయి. ఇప్పటికే అంటే 2022 ఎండింగ్ నుంచి అమెజాన్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టింది. ఈ క్రమంలోనే దాదాపు 27 వేల మంది ఉద్యోగులను తొలగించనుంది.

దాదాపుగా రెండేళ్లలో తొలగించిన దానికి మించి ఈసారి ఏకంగా 30 వేల మంది తొలగింపునకు చర్యలు చేపడుతోందన్న సమాచారంతో ఉద్యోగుల్లో వణుకు మొదలైంది. కంపెనీ చరిత్రలోనే ఇది అతి పెద్ద లేఆఫ్ అనడంలో సందేహం లేదు. అమెజాన్‌లో ప్రస్తుతం దాదాపు మూడున్నర లక్షల మంది కార్పొరేట్‌ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం పది శాతం మంది ఉద్యోగులపై కంపెనీ వేటు వేయనుందని తెలుస్తోంది. గత రెండేళ్లుగా చేపట్టిన లేఆఫ్‌లు కమ్యూనికేషన్స్ (Communications), పాడ్ కాస్టింగ్ (Podcasting), ఎక్విప్‌మెంట్ (Equipment) తదితర విభాగాల్లో ఉద్యోగులను తగ్గిస్తూ వచ్చింది. ప్రస్తుతం హ్యూమన్ రిసోర్సెస్ (Human Resources), సర్వీస్ విభాగం (Service Department) సహా తదితర విభాగాలకు చెందిన వారిని తొలగించనుంది. ఈ తొలగింపు ప్రక్రియను కంపెనీలో ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ తొలగింపు ఈ మెయిల్‌ (E mail)కు సంబంధించి ఉద్యోగులతో ఎలా కమ్యూనికేట్‌ చేయాలనే విషయంపై కంపెనీ చర్చలు నిర్వహిస్తోందని సమాచారం. ఏ ఏ విభాగాల నుంచి ఉద్యోగులను తొలగించాలనుకుంటున్నారో.. ఆయా విభాగాల నిర్వాహకులకు కంపెనీ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే వచ్చే వారం దాదాపు వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపు నోటీసులు అందే అవకాశం ఉందని సమాచారం. ఇక లేఆఫ్ అందుకోనున్న ఉద్యోగుల్లో ఎక్కువ మంది కంపెనీ ప్రధాన కార్యాలయం అయిన మిన్నియాపాలిస్‌ (Minneapolis)లో పనిచేస్తున్నవారేనని తెలుస్తోంది. మొత్తానికి 30 వేల మందిపై కంపెనీ వేటు వేసేందుకు సిద్ధమైంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 28, 2025 3:50 AM