Biggboss: బిగ్‌బాస్‌లోకి అమల్.. హాట్ టాపిక్‌గా అర్మన్.. సపోర్ట్ ఇస్తారా?
నా సోదరుడి కారణంగానో లేదంటే ఫలానా వారి మేనల్లుడు లేదంటే కొడుకు అని పిలవబడే స్థాయి నుంచి నన్నునన్నుగా గుర్తించే స్థితికి నేను వచ్చాను.

అమల్ మాలిక్ (Amal Malik)... ఇతను ఇప్పుడొక హాట్ టాపిక్. అమల్ మరెవరో కాదు.. భారతీయ సంగీత ప్రపంచంలో అత్యంత ఫేమస్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఒకడు. ఇటీవల ఆయన సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులతో సంచలనంగా మారాడు. తన కుటుంబంతో బంధాలను తెంపుకోవడం గురించి అతను ఓపెన్ అయ్యాడు. తాజాగా సల్మాన్ ఖాన్ (Salman Khan) హోస్ట్‌గా బిగ్‌బాస్ హిందీ రియాలిటీ షో (Biggboss Hindi) 19వ సీజన్ ప్రారంభమైంది. ఒకరి తర్వాత మరొకరు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో చివరి కంటెస్టెంట్ అమల్ మాలిక్.
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి ముందు తన పరిస్థితిని అమల్ వివరించాడు. తాను క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నానని.. వెల్లడించాడు. మానసిక ఆరోగ్య సమస్యలను ఇలా బహిరంగా చర్చించిన సమయాన్ని సైతం అతను గుర్తు చేసుకున్నాడు. తన డిప్రెషన్ గురించి తను ఏదైనా పోస్ట్‌ను సోషల్ మీడియా (Social Media)లో పెట్టిన ప్రతిసారి తన తల్లిదండ్రులు సహా చాలా మంది తనకు అలాంటి పోస్టులు పెట్టవద్దని సలహా ఇచ్చేవారని తెలిపాడు. అయితే గతంలో అమల్ పెట్టిన పోస్టులు ఇప్పుడు మరోమారు హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో అమల్.. ‘‘నా సోదరుడి కారణంగానో లేదంటే ఫలానా వారి మేనల్లుడు లేదంటే కొడుకు అని పిలవబడే స్థాయి నుంచి నన్నునన్నుగా గుర్తించే స్థితికి నేను వచ్చాను. ఈ ప్రయాణం మా సోదరులిద్దరికీ అద్భుతంగా ఉంది. కానీ నా తల్లిదండ్రులు చేస్తున్న పనుల కారణంగా మేము ఒకరికొకరం చాలా దూరమవుతున్నాం. అది నన్ను ఎంతగానో బాధిస్తోంది’’ అని పేర్కొన్నాడు.
ఆ తరువాత మరొక పోస్టులో అమల్ మాలిక్.. తన దుర్భలత్వాన్ని సంచలనం చేయవద్దంటూ మీడియాను కోరాడు. తన సోదరుడితో విభేదాలను అంగీకరిస్తూనే అర్మాన్‌తో బంధం పదిలంగా ఉందంటూ వెల్లడించాడు. ఇలా భిన్నమైన స్టేట్‌మెంట్స్ ఇస్తూ అప్పట్లో పెను సంచలనంగా మారాడు. ఆ తరువాత తను భావోద్వేగపరంగానూ.. ఆర్థికంగానూ కుంగిపోయానని ఈ సంఘటనల కారణంగా తాను తీవ్రంగా కుంగిపోయానంటూ అమల్ వెల్లడించాడు. ఇక తాజాగా బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం అమల్ మాటేమో కానీ అర్మన్ హాట్ టాపిక్‌గా మారాడు. తన సోదరుడికి అర్మన్ సపోర్ట్ ఇస్తారా? లేదా? అనేది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ప్రజావాణి చీదిరాల