others

‘కలర్స్ 2.0’ను ప్రారంభించిన హీరోయిన్ ఈషా రెబ్బ

ఆరోగ్యంతోనే అందం ముడిపడి ఉందని, అందుకోసం యువత ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హీరోయిన్ ఈషా రెబ్బ అన్నారు. ప్రముఖ వెల్‌నెస్ హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్’ ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ ‘కలర్స్ 2.0’ను గాజువాకలో ఏర్పాటు చేశారు.

‘కలర్స్ 2.0’ను ప్రారంభించిన హీరోయిన్ ఈషా రెబ్బ

ఆరోగ్యంతోనే అందం ముడిపడి ఉందని, అందుకోసం యువత ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హీరోయిన్ ఈషా రెబ్బ అన్నారు. ప్రముఖ వెల్‌నెస్ హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్’ ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ ‘కలర్స్ 2.0’ను గాజువాకలో ఏర్పాటు చేశారు. ఈ బ్రాంచ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం, అందం సిద్ధిస్తుందని తెలిపారు. తనకు విశాఖ అంటే ఎంతో ఇష్టమని.. ప్రస్తుత తరుణంలో ఆరోగ్యం, అందంపై శ్రద్ధ అత్యంత అవసరమని ఈషా రెబ్బపేర్కొన్నారు. ఇక ‘కలర్స్’ సంస్థ బరువు తగ్గడం, జుట్టు, చర్మ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. కలర్స్ అందించిన సేవలు ఇప్పటికే ఎంతో మందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయన్నారు.

ప్రస్తుతంలో తాను రెండు సినిమాల్లో న‌టిస్తున్న‌ట్టు ఈషారెబ్బ వెల్లడించారు.

కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ.. గాజువాకలో బ్రాంచ్ ప్రారంభించడం తమకు ఆనందంగా ఉందని.. తాను గాజువాకలో టీఎస్ఆర్ టీబీకే కళాశాలలో చదువుకున్నానని తెలిపారు. గాజువాక వాసులకు ఎప్పుడు తన ప్రాధాన్యత సేవలు అందుతాయని.. బరువు తగ్గుదల గురించి తాము అందరికీ సేవలు అందించడం ఎంతో సంతోషం అన్నారు. పదిమందికి ఉపయోగపడేది అందరికీ ప్రయోజనకారిగా ఉండే విధంగా తమ సేవలు కొనసాగుతాయ‌న్నారు. శారీరకంగా ఒక బరువు తగ్గడం అనేది, 90 రకాలకు పైగా ఇబ్బందులు తగ్గిస్తుందని.. తమ సంస్థలో 250 మందికి పైగా న్యూట్రిసినిస్ట్, 100 మందికి పైగా నిపుణులైన వైద్యులు , 2000 మంది సుశిక్షితులైన టెక్నీషియన్స్ ఉన్నారన్నారు. వారంతా 22 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్‌డేట్ చేస్తూ ‘కలర్స్ 2.0’ రూపంలో అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు.

మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, గాజువాక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. రెండు దశాబ్దాలకు పైగా అనుభవంతో నమ్మకాన్ని సంపాదించిన కలర్స్, ఇప్పుడు మరింత ఆధునిక సేవలను అందించనుందని తెలిపారు. ఆరోగ్యంగా, అందంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికీ తమ సేవలు ఉపయోగపడతాయన్నారు. ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, కలర్స్‌ను ఉత్తమ వెల్‌నెస్ క్లినిక్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. బరువు తగ్గడం, ఆరోగ్య సంరక్షణ, అందం పరిరక్షణలో ప్రత్యేక సేవలను అందిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 51 మంది డెర్మటాలజిస్టులతో సేవలు అందిస్తున్న ఏకైక వెల్నెస్ సంస్థగా కలర్స్ ప్రత్యేకత సాధించిందని అన్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 21, 2026 4:09 AM