others

Biggboss 9: బిగ్‌బాస్ విన్నర్‌గా కామన్ మ్యాన్.. దద్దరిల్లిన టీఆర్పీలు..

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) విన్నర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి బిగ్‌బాస్ టీం (Biggboss Team) సైతం చాలా సస్పెన్స్ మెయిన్‌టైన్ చేయడంతో షో (Biggboss Show) ప్రారంభానికి ముందు వరకూ విన్నర్ (Biggboss 9 Telugu Winner) ఎవరనేది బయటకు రాలేదు.

Biggboss 9: బిగ్‌బాస్ విన్నర్‌గా కామన్ మ్యాన్.. దద్దరిల్లిన టీఆర్పీలు..

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) విన్నర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి బిగ్‌బాస్ టీం (Biggboss Team) సైతం చాలా సస్పెన్స్ మెయిన్‌టైన్ చేయడంతో షో (Biggboss Show) ప్రారంభానికి ముందు వరకూ విన్నర్ (Biggboss 9 Telugu Winner) ఎవరనేది బయటకు రాలేదు. తనూజ (Tanuja) వర్సెస్ కల్యాణ్ పడాల (Kalyan Padala) బయట అయితే పెద్ద వారే నడిచింది. హౌస్‌ (Biggboss House)లో మాత్రం వీరిద్దరూ మంచి స్నేహితులుగా నడుచుకున్నారు. ఫైనల్ వరకూ వీరిద్దరి మధ్య మంచి హెల్దీ కాంపిటేషన్ నడిచింది. ఫైనల్‌గా విన్నర్ ఎవరనేది బయటకు వచ్చింది. కల్యాణ్ పడాల బిగ్‌బాస్ విన్నర్‌ అవగా.. తనూజ రన్నర్‌గా మారింది.

ఇక డెమాన్ పవన్ (Demon Pawan) రూ.20 లక్షలు అందుకుని లాస్ట్‌లో రేస్ నుంచి తప్పుకున్నాడు. డెమాన్ పవన్ సూట్‌కేసు తీసుకోవాలని అంతా భావించారు. అతను ఆర్థిక పరిస్థితి రీత్యా అంతా అతను డబ్బులు తీసుకుంటే బాగుండని భావించారు. అందరి అంచనాలకు తగినట్టుగానే డెమాన్ డబ్బులు తీసుకుని సైడ్ అయిపోయాడు. మొత్తానికి కల్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. ఆది నుంచి విన్నర్ మెటీరియల్‌గా ఉన్న తనూజ ఒకరకంగా చెప్పాలంటే.. తన గొయ్యి తనే తవ్వుకుంది. ఆమె ఎవరి మీద పడితే వారి మీద నోరేసుకుని పడిపోవడం.. అందరి సపోర్ట్ తీసుకుని తనకెవరూ చేయలేదనడం వంటి అంశాలతో పాటు మరికొన్ని అంశాలు ఆమె రన్నర్‌గా మారడానికి కారణమయ్యాయి. పైగా తనూజకు వ్యతిరేకంగా ఎంతో మంది రివ్యూవర్స్ పని చేశారు. ప్రతి ఒక్కరూ తనూజలోని తప్పులను ఎత్తి చూపిస్తూ వీడియోలు చేయడంతో ఆమెకు ఓటింగ్ తగ్గింది. ఫైనల్‌గా కల్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. మొత్తానికి హాట్ స్టార్ టీఆర్పీలు అయితే బద్దలయ్యాయి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
December 21, 2025 2:01 PM