Rain Alert: నేటి నుంచి ఏపీలో భారీ వర్షాలు
నేటి నుంచి ఏపీ (AP)కి పెద్ద ఎత్తున వర్షాలు (Rain alert to AP) కురవనున్నాయి. నాలుగు రోజుల తర్వాత దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది.

నేటి నుంచి ఏపీ (AP)కి పెద్ద ఎత్తున వర్షాలు (Rain alert to AP) కురవనున్నాయి. నాలుగు రోజుల తర్వాత దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని విపత్తుల నిర్వహణ సంస్థ (Disaster Management Organization) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. ఈ క్రమంలోనే అది మంగళవారం నాటికి బలహీనపడుతుందని తెలిపింది. ఆ తరువాత అది వాయుగుండంగా మారి ఆ ప్రభావంతో ఏపీలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురవనున్నాయని వాతావరణ సంస్థ (Meteorological Agency) వెల్లడించింది.
నేటి నుంచి ఏపీలోని ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయో తెలుసుకుందాం. బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, 21న పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, 22న బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. అలాగే 23న కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది.