others

Over Weight: అధిక బరువు తగ్గాలంటే ఇలా చేయాల్సిందే..

బరువు తగ్గాలని ఎవరికి ఉండదు? కానీ ఎంత మూల్యానికి? ఇదేంటి ఇలా అడుగుతున్నా అంటున్నారా? ఇటీవలి కాలంలో జరుగుతున్నది ఇదే కదా. బరువు తగ్గాలి అనుకోగానే కుప్పులు తెప్పలుగా..

Over Weight: అధిక బరువు తగ్గాలంటే ఇలా చేయాల్సిందే..

బరువు తగ్గాలని ఎవరికి ఉండదు? కానీ ఎంత మూల్యానికి? ఇదేంటి ఇలా అడుగుతున్నా అంటున్నారా? ఇటీవలి కాలంలో జరుగుతున్నది ఇదే కదా. బరువు తగ్గాలి అనుకోగానే కుప్పులు తెప్పలుగా తెరిచి ఉంచిన డైట్ సెంటర్స్‌కి పరుగులు తీయడం.. వారు చెప్పిన అడ్డమైన డైట్స్‌ను ఫాలో అవడం.. వెరసి అప్పటికి బరువు తగ్గవచ్చేమో కానీ ఆ తరువాత ఇబ్బందులు ఎలాగూ ఉంటాయి కదా. ఇబ్బందులంటే సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట.

కరోనా (Covid) తరువాత కొందరైతే ఆరోగ్యం (Health)పై బాగా ఫోకస్ పెట్టారు. అది కూడా కొంతకాలమే. ఆ తరువాత ఎందుకో తిరిగి మామూలే. బిజీ లైఫ్ కారణమో మరొక కారణమో కానీ సమయానికి దొరికింది తినేసి కాలం వెళ్లదీస్తున్నారు. తద్వారా బరువు (Over Weight) పెరిగిపోతున్నారు. మరికొందరు మాత్రం సమయం ఉన్నా కూడా వండుకోలేక బయటి ఫుడ్ తీసుకోవడంతో పాటు ఎలాంటి ఎక్సర్‌సైజ్ (Excercise) చేయకుండా బరువు పెరిగిపోతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు.. డైట్‌ (Diet)కి పరిమితులంటూ ఉండవు. సమయపాలన అంతకు మించి ఉండదు. తద్వారా బరువు పెరగక ఏమవుతుంది? ఆ తరువాత బరువు పెరిగామని.. ఏవేవో డైట్ ప్లాన్స్ అమలు చేస్తూనే ఉన్నారు.

నెలలో ఎంత బరువు తగ్గాలి?

ఏమాత్రం ఒంటికి పని చెప్పరు కానీ ఒళ్లంతా కరిగిపోవాలి. అంటే ఎలా? ఇష్టానుసారంగా డైట్స్ మెయిన్‌టైన్ చేస్తే ఏం జరుగుతుంది? ఇలా చేయడం వలన శరీరానికి మీరేం మెసేజ్ ఇస్తున్నట్టు? ఆరోగ్యకరంగా బరువు తగ్గడమనేది మన చేతిలోనే ఉంది. సులభంగా నెలలో 10 కేజీలు బరువు తగ్గండిలా.. అనగానే డైట్ సెంటర్‌కి పరుగులు తీయకండి. నెలలో 3-4 కేజీలకు మించి బరువు తగ్గడమనేది ఏమాత్రం ఆరోగ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యంగా ఉండటానికి ఏ ఒక్క డైట్ కూడా ది బెస్ట్ అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే సమతుల్య ఆహారం తీసుకోకుంటే ఇబ్బందులు తప్పవనేది నిపుణులు చెబుతున్న మాట. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ (Proteins), పండ్లు (Fruits), కూరగాయలు, ఫైబర్, వంటివి అన్నీ కూడా సమపాళ్లలో ఉండాలి. లేదంటే విటమిన్ లోపం కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఫలితాలను ఫేస్ చేయడం చాలా కష్టం..

ముఖ్యంగా మంచి ఆరోగ్యం కోసం ప్రాసెస్డ్ ఫుడ్‌కి దూరంగా ఉండాల్సిందే.. రోజుకు ఒక గంట పాటు వాకింగ్ లేదంటే ఏదో ఒక ఎక్సర్‌సైజ్ తీసుకుంటూ బయటి ఫుడ్‌ని సాధ్యమైనంత మేర తగ్గించి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే బరువు తగ్గిపోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలంటే కేలరీ (Calories) కౌంట్ తప్పనిసరి. కొన్ని ఆహారాల్లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తీసుకునే ప్రతి ఆహారాన్ని కేలరీల కౌంట్ చూసుకుని తీసుకోవడం తప్పనిసరి. అలాగే పోషకాహార లోపం కూడా రాకుండా చూసుకోవాలి. లేదంటే ఫలితాలను ఫేస్ చేయడం చాలా కష్టం. ఎక్కువ పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు తీసుకోవడంతో పాటు వారంలో కనీసం నాలుగు రోజుల పాటు శారీరక శ్రమ చేయడం తప్పనిసరి. అలాగే అధిక రక్తపోటు, షుగర్ వంటి సమస్యలు ఉన్నవారు దానికి తగినట్టుగానే డైట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఒకేరకమైన డైట్ వర్తించదు. ఇక ఆరోగ్య సమస్యలు ఉన్నా.. లేకున్నా డైట్‌లో షుగర్ (Sugar), సాల్ట్ (Salt) వంటివి తగ్గించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 17, 2025 5:06 AM