others

Viral News: సక్సెస్ అంటే ఇది.. నూడిల్స్‌తో నెలకు రూ.30 లక్షలు.. ఈ వ్యక్తి కథ తెలిస్తే..

ఏదైనా సరే.. కొంచెం సిగ్గు పడకుండా బిజినెస్ ప్రారంభిస్తే క్లిక్ అయ్యిందా? ఏడాదికి కోట్లు సంపాదించవచ్చు. ఏ ఉద్యోగం ఇస్తుంది.. అంతటి భరోసా? అనిపిస్తుంది ఈ కథ తెలిస్తే..

Viral News: సక్సెస్ అంటే ఇది.. నూడిల్స్‌తో నెలకు రూ.30 లక్షలు.. ఈ వ్యక్తి కథ తెలిస్తే..

తెలివుంటే బతకరా కొడుకా.. అన్నాడట వెనుకటికొకడు.. అంటే తెలివి ఉండాలే గానీ ఎలాగైనా బతకొచ్చు. ఉద్యోగాన్నే నమ్ముకుని కూర్చొంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉద్యోగం కోసం కొన్ని ట్రయల్స్.. రాలేదా? బతికే మార్గం కోసం వెదుక్కోవాలి. ఏదైనా సరే.. కొంచెం సిగ్గు పడకుండా బిజినెస్ ప్రారంభిస్తే క్లిక్ అయ్యిందా? ఏడాదికి కోట్లు సంపాదించవచ్చు. ఏ ఉద్యోగం ఇస్తుంది.. అంతటి భరోసా? అనిపిస్తుంది ఈ కథ తెలిస్తే.. అదేంటంటే.. ఓ వ్యక్తి నూడుల్స్ అమ్ముకుని రోజుకు రూ.లక్ష అంటే నెలకు రూ.30 లక్షలు సంపాదిస్తున్నాడు.

ఉద్యోగం (Job) అంటే.. ఎవడి కోసమో గొడ్డులా పని చేయడమేనని చాలా మంది భావన. ఇది నిజం కూడా.. చాలా మంది తమ ఉద్యోగుల్ని మనుషుల్లా కూడా చూడరు. పైగా బాసిజం భరించలేంరా బాబు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు ఏదో ఒక వ్యాపారం (Business) అయితే చూసుకుంటారు. అలా ఓ వ్యక్తి నూడిల్స్ వ్యాపారాన్ని (Noodles Business) నిర్వహిస్తూ రోజుకు లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు. పోనీ అతనేమైనా చదువు రానివాడా? అంటే.. పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్ (PhD Graduate). వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ (Jiangsu province) నుంచి పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్ అయిన డింగ్ (37).. బెల్జియంలో నేల నిర్వహణ, పంట ఉత్పత్తిలో పోస్ట్‌డాక్టోరల్ పరిశోధనను పూర్తి చేశాడు. దీనిపై దాదాపు 30 అకడమిక్ పేపర్స్‌ను ప్రచురించాడు. ఈ క్రమంలోనే అతను తనకు ఆసక్తి ఉన్న పరిశోధనా రంగంలోనే ఉద్యోగం చేయాలని భావించాడు. కానీ అతనికి తను కోరుకున్న ఉద్యోగం లభించలేదు.

చివరికి ఆర్థిక ఇబ్బందుల (Financial Problems)ను సైతం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక ఈ ఉద్యోగాల వేట వద్దనుకుని తన భార్య వాంగ్‌తో కలిసి డింగ్ కుటుంబ పోషణకు నూతన మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే నూడిల్స్ స్టాల్. బెల్జియం (Belgium)లోనే భార్యాభర్తలిద్దరూ స్పైసీ పీ నూడిల్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు. నూడిల్స్ అందరిలా కాకుండా రుచిగా ఉండేందుకు రకరకాల పదార్థాలను వినియోగించేవారు. పంది మాంసంతో తయారు చేసిన సాస్, బఠాణీలు స్ట్రాండ్స్ వంటివి ఉపయోగించి టేస్టీ ఫుడ్‌ను తమ కస్టమర్లకు అందించేవారు. ఈ టేస్ట్ స్థానికులకు బాగా నచ్చింది. ఇంకెందుకు ఊరుకుంటారు? కుటుంబంతో కలిసి వచ్చి మరీ ఆరగించడం ప్రారంభించారు. అంతే వ్యాపారం భారీగా జరిగేది. ఒక బౌల్ నూడిల్స్ ధర వచ్చేసి 7 నుంచి 9 డాలర్లు. రోజుకు 1200 యూఎస్ డాలర్ల వ్యాపారం జరిగేది. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. రూ.105,388. అలా నెలకు చూస్తే రూ.30 లక్షలు అన్నమాట. ఇక డింగ్, వాంగ్ దంపతుల సక్సెస్ గాథ చైనీస్ సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవడంతో అతని ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగింది. ఇప్పుడు వారికి 78 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 17, 2025 1:48 PM