Biggboss9: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఎవరెవరంటే..
వైల్డ్ కార్డు ద్వారా కొంతమందిని హౌస్‌లోకి పంపించనున్నారు. అక్టోబర్ ఫస్ట్ వీకెండ్‌లో శనివారం కొందరు, ఆదివారం కొందరు హౌస్‌లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారట.

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu)ను రసవత్తరంగా మార్చేందుకు బిగ్‌బాస్ (Biggboss) ఇక మీదట వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ప్రవేశపెట్టనున్నట్టు సమచారం. ప్రస్తుతానికి అయితే ఈ సీజన్ బాగానే నడుస్తోందని తెలుస్తోంది. టీఆర్పీ (TRP)లు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ షో నుంచి ఇద్దరు ఎలిమినేట్ (Eliminate) అయి వెళ్లిపోయారు. తొలివారం పెద్దగా నడవకపోయినా కూడా రెండవ వారం నుంచి బాగానే నడుస్తోంది. దీనిని మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చేందుకు వైల్డ్ కార్డు ద్వారా కొంతమందిని హౌస్‌లోకి పంపించనున్నారు. అక్టోబర్ ఫస్ట్ వీకెండ్‌లో శనివారం కొందరు, ఆదివారం కొందరు హౌస్ (Biggboss House)లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారట.
గత రెండు సీజన్లుగా ఇది జరుగుతూనే ఉంది. ఈసారి కూడా అదే రీతిలో చేయబోతున్నారు. పైగా సీక్రెట్ రూం కూడా ఈసారి ఉంటుందని టాక్. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఆరుగురు ఉండనున్నారని సమాచారం. వీరిలో ఇద్దరు ఎక్స్ కంటెస్టెంట్స్ అని సమాచారం. ఈ ఆరుగురు ఎవరంటే.. ఒకరు సుహాసిని (Serial Actress Suhasini).. ఈమె వెండితెరపై ఎంట్రీ ఇచ్చి.. ఆ తరువాత బుల్లితెరపై సీరియల్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. రెండవ వ్యక్తి చిన్ని సీరియల్ హీరోయిన్ కావ్య (Serial Actress Kavya). గత సీజన్ విన్నర్ నిఖిల్ (Biggboss Winner Nikhil) ఎక్స్ లవర్ కావడంతో షో ఇంట్రస్టింగ్‌గా మారుతుందని టాక్. మూడవ వ్యక్తి అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య (Alekhya Chitti pickles Ramya). ఈమె కాంట్రవర్సీకి బ్రాండ్ అంబ్రాసిడర్.
ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. వాస్తవానికి ఈమె సెలబ్రిటీ కాదు కానీ సెలబ్రిటీ కేటగిరీలోనే ఈమెను తీసుకున్నారు. అయితే గతంలో ఈమె 3-4 చిత్రాల్లో నటించారని టాక్. నాలుగవ వ్యక్తి దివ్వెల మాధురి (Divvela Madhuri). ఈమె వస్తే షో ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఐదవ వ్యక్తి ప్రియాంక జైన్ ప్రియుడు శివ్ (Actor Shiv). వాహ్ చెఫ్ సంజయ్ తుమ్మా (Sanjay Tumma), సింహాద్రి మూవీ హీరోయిన్ అంకిత (Heroine Ankitha). ఇక నంబర్ విషయమై క్లారిటీ అయితే లేదు కానీ వీరి నుంచి తప్పకుండా కొందరుంటారని టాక్. ఇక ఎక్స్ కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. అమర్ దీ (Amar Deep)ప్ కానీ తనీష్ (Tanish) కానీ రావొచ్చని టాక్. ఇక చూడాలి.. వీరిలో ఎవరెవరు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారో చూడాలి.
ప్రజావాణి చీదిరాల