Tesla EV: ఇండియాలో తొలి టెస్లా కారు.. కొనుగోలు చేసిందెవరంటే..
ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇండియన్ మార్కెట్‌లోకి సైతం అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే టెస్లా సంస్థ తాజాగా తొలి కారును డెలివరీ చేయడం కూడా జరిగిపోయింది.

ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla) ఇండియన్ మార్కెట్ (Indian Market)లోకి సైతం అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే టెస్లా సంస్థ తాజాగా తొలి కారును డెలివరీ చేయడం కూడా జరిగిపోయింది. ప్రస్తుతం తొలి టెస్లా కారును ఇండియా (India)లో ఎవరు కొనుగోలు చేశారనేది ఆసక్తికరంగా మారింది. టెస్లా ఈవీ కారు (Tesla EV Car)ను మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ (Minister Prathap Sirnayak) కొనుగోలు చేశారు. తెలుపు రంగు టెస్లా మోడల్ వై (Tesla Model Y Car) కారును కొనుగోలు చేశారు. ముంబయిలోని ‘టెస్లా (Tesla) ఎక్స్‌పీరియెన్స్ సెంటర్’లో ప్రతాప్ సర్‌నాయక్‌కు కారు తాళాలను మంత్రికి అందజేశారు. దేశంలో తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం పట్ల మంత్రి ప్రతాప్ స్పందించారు. పర్యావరణహిత వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicle)పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తాను టెస్లా కారును కొనుగోలు చేసినట్టు తెలిపారు. టెస్లా సంస్థ ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందినది. భారత్‌లోని ముంబై (Mumbai)లో జూలై 15న టెస్లా తన తొలి షోరూంను ప్రారంభించి ఎస్‌యూవీ మోడల్ వై కారు విక్రయాలను ఇక్కడ మొదలు పెట్టింది. చైనాలోని తమ ప్లాంటులో పూర్తిగా తయారైన కారును టెస్లా దిగుమతి చేసుకుంది. ఈ క్రమంలోనే విక్రయాలు చేపట్టింది. ఈ కారును రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. రేర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ.59.89 లక్షల నుంచి ప్రారంభమైన ఈవీ వెహికిల్‌ను ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కి.మీ. హాయిగా ప్రయాణించొచ్చు. లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ ప్రారంభ ధర రూ.67.89 లక్షలు కాగా.. దీనిని ఒకసారి ఛార్జింగ్ చేస్తే 622 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ఈ కార్ల కోసం ఇప్పటి వరకూ 600 బుకింగ్‌లు వచ్చినట్లు తెలుస్తోంది.