Biggboss: కామనర్స్ అంతా కలిసి ఆయన్ను విన్నర్ చేసేలా ఉన్నారుగా..
గొర్రెల మాదిరిగా ఒకటే కారణంతో అందరూ ఒకరిపైనే పడుతున్నారు. దీంతో ఆ వ్యక్తిపై బయట సింపతి బాగా పెరిగిపోతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. అంటారా?

ఎప్పుడైతే కొందరు వ్యక్తులు ఒకరిని అనవసరంగా ఎక్కువగా టార్గెట్ చేస్తారో.. సర్వసాధారణంగా ఆ వ్యక్తిపై బయటి నుంచి చూసేవారికి సానుభూతి ఓ రేంజ్‌లో పెరిగిపోతుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లోనూ అదే జరుగుతోంది. కనీస అవగాహన లేదు.. గొర్రెల మాదిరిగా ఒకటే కారణంతో అందరూ ఒకరిపైనే పడుతున్నారు. దీంతో ఆ వ్యక్తిపై బయట సింపతి బాగా పెరిగిపోతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. అంటారా?
మాస్క్ మ్యాన్ హరీష్ (Mask Man Harish) అనుకునేరు. ఆయనకంత సీన్ లేదు. హౌస్ (Biggboss House)లో అయినా ఆయనపై ఒకరు కాకుంటే ఒకరైనా సింపతి చూపిస్తారేమో కానీ బయట ఆయనకు ఏమాత్రం అది దక్కేలా లేదు. పైగా రోజురోజుకీ ఆయన ప్రవర్తన దారుణం. అసలు ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మరి ఆ వ్యక్తి ఎవరంటారా? ఇంకెవరు భరణి (Actor Bharani). వాస్తవానికి భరణి సెలబ్రిటీ అయినా కూడా సోషల్ మీడియా (Social Media) పరంగా ఆయన చాలా వీక్. తిప్పికొడితే పదివేల మంది ఫాలోయింగ్ కూడా లేని వ్యక్తి ఆయన. చాలా లో ప్రొఫైల్ మెయిన్‌టైన్ చేశారు. అలాంటి వ్యక్తికి బీభత్సమైన హైప్ ఇచ్చేలా కామనర్స్ అంతా ప్రయత్నిస్తున్నారనడంలో సందేహమే లేదు. అంతేకాకుండా ఈ రెండు రోజుల నామినేషన్ సమయంలో భరణికి కావల్సినంత హైప్ వచ్చేసిందని కూడా చెప్పాల్సిందే.
కామనర్స్ అంతా గుడ్డు.. గుడ్డు.. గుడ్డు.. గాడిద గుడ్డు.. ఎంతకాలం తిరుగుతారు ఆ గుడ్డు చుట్టూ? ఏమైనా ఉంటే వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున (Biggboss Host Nagarjuna) అడిగి ఉండేవారు కదా.. కనీసం భరణి ప్లేటు కూడా నాగ్ (Nag) పగులగొట్టలేదు.. అసలాయన జోలికే వెళ్లలేదు. వీళ్లెందుకు ఆయనపై అంతలా రెచ్చిపోతున్నారు. దాని వలన కలిగే ప్రయోజనం వీళ్లకేం లేదు కానీ భరణికి మాత్రం కావల్సినంత ఉంది. బయట ఆయనకు సింపతి టన్నుల్లో వర్కవుట్ అవుతోంది. కామనర్స్ గ్రాఫ్ బయట రోజురోజుకీ పడిపోతోంది. ఈ లెక్కన వారానికో కామనర్ బయటకు వచ్చే అవకాశం ఉండటంతో బిగ్‌బాస్ నిర్వాహకులు సైతం వారి మాటలను పూర్తి స్థాయిలో బయటకు రాకుండా ఎడిటింగ్‌లో లేపేస్తున్నారని టాక్. ఒకవేళ వారు మాట్లాడింది మాట్లాడినట్టు బయటకు వస్తే ఒక్కరు కూడా హౌస్‌లో ఉండరనడంలో సందేహమే లేదని తెలుస్తోంది.
ఇకపోతే భరణి విషయంలోనూ బిగ్‌బాస్ టీం గేమ్ ప్లే చేస్తోందని సమాచారం. నామినేషన్లకు సంబంధించిన లైవ్ చూసిన వారికి ఈ విషయం అర్థమవుతుంది. భరణి తనను తాను డిఫెండ్ చేసుకున్న తీరు అద్భుతం. పాయింట్స్ పెట్టడం కూడా పర్ఫెక్ట్‌గా పెట్టేశారు. కానీ అవేమీ బిగ్‌బాస్ టీం (Biggboss Team) బయటకు రానివ్వడం లేదు. ఎడిటింగ్ (Editing)లోనే లేపేస్తున్నారు. మొత్తానికి కామనర్స్ అంతా కలిసి ఇలాగే భరణిని టార్గెట్ చేసి ఆయనకు కప్ ఇచ్చి మరీ పంపించేలా ఉన్నారని మాత్రం బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు (Biggboss Season 9 Telugu) చూసేవారికి అర్థమవుతుంది.
ప్రజావాణి చీదిరాల