others Breaking News

పులివెందులలో టీడీపీ ఘన విజయం.. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

కడప జిల్లా పులివెందుల వైసీపీ కంచుకోట. వైసీపీ అధినేత జగన్ స్వస్థలం. అలాంటి చోట టీడీపీ జెండా ఎగిరింది. జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది.

పులివెందులలో టీడీపీ ఘన విజయం.. డిపాజిట్ కోల్పోయిన వైసీపీ

కడప జిల్లా పులివెందుల (Pulivendula) వైసీపీ (YCP) కంచుకోట. వైసీపీ అధినేత జగన్ (YS Jagan) స్వస్థలం. అలాంటి చోట టీడీపీ (TDP) జెండా ఎగిరింది. జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. తాజాగా జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ తరుఫున లతారెడ్డి పోటీ చేయగా.. వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు సైతం పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఆయనపై లతారెడ్డి 6,035 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీకి కేవలం 683 ఓట్లు మాత్రమే లభించాయి. మిగిలిన అభ్యర్థులకు 100 లోపు ఓట్లు మాత్రమే లభించాయి.

ఈ ఎన్నికల్లో చాలా అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. పోలింగ్ బూత్‌లలోకి తమ పార్టీ అభ్యర్థులను వెళ్లనివ్వలేదన్నారు. అది మాత్రమే కాకుండా పోలీస్ యంత్రాంగాన్ని వినియోగించుకున్నారని.. కొన్ని పోలింగ్ బూత్‌లను టీడీపీ అభ్యర్థులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారంటూ విమర్శించారు. ఇది మాత్రమే కాకుండా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేసి.. తిరిగి పోలింగ్‌ నిర్వహించేలా ఆదేశాలివ్వాలని వైసీపీ హైకోర్టును (AP High Court) ఆశ్రయించింది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 14, 2025 8:03 AM