Biggboss9: షాకింగ్.. డ్రగ్స్ కేసులో సంజనకు సుప్రీం నోటీసులు.. నెక్ట్సేంటి?
బిగ్‌బాస్ 9 తెలుగులో నిత్యం దొంగతనాలు చేయడమే కంటెంట్ అని తను ఫీలవుతూ ప్రేక్షకులకు తలనొప్పి తెప్పిస్తున్న నటి సంజనా గర్లాని. తాజాగా ఆమెకు సుప్రీం నోటీసులు ఇచ్చింది.

బిగ్‌బాస్ 9 తెలుగులో నిత్యం దొంగతనాలు చేయడమే కంటెంట్ అని తను ఫీలవుతూ ప్రేక్షకులకు తలనొప్పి తెప్పిస్తున్న నటి సంజనా గర్లాని. తాజాగా ఆమెకు సుప్రీం నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ కేసును కర్ణాటక ప్రభుత్వం తిరగతోడటంతో సంజనకు ఇబ్బందికర పరిస్థితులు మరోసారి ప్రారంభమయ్యాయి. డ్రగ్స్ కేసులో సంజనాయే కీలకమని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. అసలేం జరిగిందో చూద్దాం.
కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తాజాగా నటి అర్చన గల్రానీ అలియాస్ సంజన గల్రానీ (Sanjana Garlani)కి స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసింది. కర్ణాటకలో సెలబ్రిటీస్ డ్రగ్స్ (Drugs) వాడకంపై పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. వారందరికీ డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిలో సంజనా (Sanjana)యే కీలకమంటూ ఆరోపణలు వెల్లవెత్తాయి. అంతేకాకుండా ఫైవ్ స్టార్ పార్టీల కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సంజన డ్రగ్స్ సేకరించిందని వార్తలు వెల్లువెత్తాయి. అయితే ఈ కేసులో సంజనకు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఆమెపై ఉన్న చర్యలను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీనిపై సుప్రీంలో వాదనలు విన్న తర్వాత, మార్చి 25, 2024న జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సంజనకు నోటీసు జారీ చేయాలని ధర్మాసనం నిర్ణయించింది. కాల్ రికార్డులు, మొబైల్ ఫోన్‌ల ఫోరెన్సిక్ నివేదిక (Forensic report)ల ఆధారంగా నిందితులు ఎక్స్‌టసీ, కొకైన్, MDMA, LSD మొదలైన డ్రగ్స్ కోసం.. డ్రగ్ డీలర్స్, కొందరు నైజీరియన్స్ (Nigerians)తో సంప్రదింపులు జరుపుతున్నారని విచారణలో తేలిందని కర్ణాటక ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకు వివరించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం సంజన బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది. ఈ క్రమంలోనే ఆమె తరుఫున ఆమె న్యాయవాదులు సుప్రీం నోటీసులపై స్పందించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే కేవలం స్పందన మాత్రమే సుప్రీంకోర్టు కోరింది కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఆమె సుప్రీంకు హాజరు కావాలని ఆదేశిస్తే మాత్రం తప్పనిసరిగా సుప్రీంకు సంజన హాజరు కావాల్సి వస్తుంది. దీంతో ఆమె బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రాక తప్పదు.
ముఖ్యంగా కోర్టు కేసులు ఏమైనా ఉంటే మాత్రం బిగ్‌బాస్ (Biggboss) నిర్వాహకులు ఇలాంటి వారిని ఎంటర్‌టైన్ చేయరన్న విషయం తెలిసిందే. ఆమె తప్పక బయటకు రావాల్సి వస్తుంది. ఏదో పూటకో దొంగతనం చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్న సంజన మెడకు మరోసారి డ్రగ్స్ కేసు (Drugs Case) చుట్టుకుంది. హైకోర్టులో క్లీన్ చిట్ వచ్చేసిందని ప్రశాంతంగా బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లో కాలం గడుపుతోంది. కానీ కర్ణాటక ప్రభుత్వం కేసును సుప్రీంకు తీసుకెళ్లందని తెలిస్తే సంజన పరిస్థితి ఏంటో.. అసలే బిగ్‌బాస్ హౌస్‌కి అడుగు పెట్టే సమయంలోనే తన తప్పు లేకుండానే సడెన్‌గా కేసులో ఇరుక్కోవాల్సి వచ్చిందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మొత్తానికి మ్యాటర్ సీరియస్ కానంత వరకే సంజన హౌస్‌లో.. ఒక్కసారి అయ్యిందంటే బిగ్‌బాస్‌ను వీడాల్సిందే..
ప్రజావాణి చీదిరాల