ప్రియకు ఎలిమినేషన్ తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ కనబడినట్టుందిగా..
జనాల్లో ఆమెకు ఎందుకంత నెగిటివిటీ వచ్చిందో తెలుసుకునేందుకు ఎక్కడి వరకో వెళ్లాల్సిన పని లేదు. బిగ్‌బాస్ బజ్‌లోనే శివాజీ ఆమెకు చుక్కలు చూపించారు

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) నుంచి మూడవ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఇప్పటికే శ్రష్టి వర్మ (Srushti Varma), మర్యాద మనీష్ (Maryada Manish) ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. ఇక నిన్న (ఆదివారం) ప్రియా శెట్టి ఎలిమినేట్ (Priya Shetty Eliminate) అయి బయటకు వచ్చేసింది. శ్రష్టి వర్మ తొలివారమే కాబట్టి ఆమె ఆట తీరు ఆధారంగా ఎలిమినేషన్ డిసైడ్ అవలేదు. కేవలం ఓటింగ్ లేక బయటకు వచ్చేసింది. మర్యాద మనీష్ వచ్చేసి స్ట్రాటజీస్ ఎక్కువవడంతో పాటు తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం అతనికి పెద్దగా రాలేదు. దీంతో ఎలిమినేట్ అయ్యాడు.
ఇక ప్రియ (Priya) విషయానికి వస్తే.. ఆమె నోరు, బిహేవియర్ ఆమెకు చేటు తెచ్చింది. ఈ విషయం ఆమెకు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చాక అర్థమైంది కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. పైగా డ్యామేజ్ కంట్రోల్‌కు టైం లేకుండా పోయింది. దీంతో ప్రియకు బయటకు రాక తప్పలేదు. నిజానికి తను ఎలిమినేట్ అవుతానని ప్రియ కూడా ఊహించి ఉండదేమో. ఎలిమినేట్ అయ్యాక ఆమె ఏం చేసిందన్నది క్లియర్‌గా తెలుస్తోంది. జనాల్లో ఆమెకు ఎందుకంత నెగిటివిటీ వచ్చిందో తెలుసుకునేందుకు ఎక్కడి వరకో వెళ్లాల్సిన పని లేదు. బిగ్‌బాస్ బజ్ (Biggboss Buzz)లోనే శివాజీ (Shivaji) ఆమెకు చుక్కలు చూపించారు.
హోస్ట్ ముందు ఆమె కూర్చున్న విధానాన్ని ఆమెకు ఫోటో బయటపెట్టి మరీ చూపించి షాకిచ్చారు. మొత్తానికి బిగ్‌బాస్ బజ‌్‌తోనే ప్రియకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినట్టుంది. ఇక ప్రియ బయటకు వచ్చేముందు ఆమె వీడియో చూసిన వారికి రెండు తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. హౌస్‌లోకి ప్రియ వెళుతున్న సమయంలో బొద్దుగా కనిపిస్తే వచ్చేటప్పుడు మాత్రం స్లిమ్ అయి వచ్చింది. ఇక నోరు చాలా కంట్రోల్ అయ్యింది. తనే ఎక్కువగా కెమెరాల్లో కనిపించాలన్న తపనో మరొకటో కానీ శ్రీజతో కలిసి బాగా నోరేసుకుని ప్రతి ఒక్కరిపై పడిపోయేది. హౌస్ (Biggboss House) నుంచి బయటకు వస్తున్నప్పుడు మాత్రం చాలా కామ్‌గా.. పొలైట్‌గా వచ్చేసింది. ఒక వ్యక్తిలో ఇంతకు మించిన మార్పేం కావాలిలే..
ప్రజావాణి చీదిరాల