others

Inter Exams: ఏపీలో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ ఫిక్స్..

ఏపీలో ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ (AP Inter Exams schedule) వచ్చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు (Inter Exams) జరుగనున్నాయి.

Inter Exams: ఏపీలో ఇంటర్ పరీక్షలకు షెడ్యూల్ ఫిక్స్..

ఏపీలో ఇంటర్‌ పరీక్షలకు షెడ్యూల్‌ (AP Inter Exams schedule) వచ్చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలు (Inter Exams) జరుగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు పరీక్షల (Inter Board Exams) షెడ్యూల్‌ను ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఏపీ ఇంటర్ బోర్డు తెలిపింది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. ప్రాక్టికల్ పరీక్షలు (Inter Practical Exams) వచ్చేసి ఫిబ్రవరి 1 నుంచే ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 10 నాటికి జనరల్ కోర్సులకు ప్రాక్టికల్స్ పూర్తవుతాయి. ఒకేషనల్ కోర్సులకు (Inter Vocational Course) అయితే జనవరి 27 నుంచే ప్రారంభమవుతాయి. రెండు సెషన్స్‌లో ఫిబ్రవరి 10 వరకూ జరుగుతాయి.

ఇక ఇంటర్ పరీక్షలు (Inter Exams) వచ్చేసి ఫిబ్రవరి 23 నుంచి ఫస్ట్ ఇయర్ (Inter Ist Year), ఫిబ్రవరి 24 నుంచి సెకండ్ ఇయర్ (Inter Second Year) విద్యార్థులకు ప్రారంభమవుతాయి. ప్రాక్టికల్‌ పరీక్షల విషయానికి వస్తే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ.. ఫస్ట్ సెషన్‌ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండో సెషన్‌ ఉంటాయి. ఆదివారాల్లో కూడా ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. అయితే ఇదే ఫైనల్ కాదని.. తాత్కాలిక షెడ్యూల్‌ మాత్రమేనని ఇంటర్ బోర్డు (Inter Board) తెలిపింది. పండుగల్లో సెలవుల (Festival Holidays)తో పాటు ఇతరత్రా ఏమైనా ఎమర్జన్సీ ఉంటే మాత్రం షెడ్యూల్‌‌లో మార్పులు చేర్పులు ఉంటాయని ఇంటర్ బోర్డు తెలిపింది.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 3, 2025 3:32 PM