Biggboss9: వామ్మో.. చంద్రముఖిగా మారిన సంజన..
ఇవాళ సంజన తన ఫుడ్ కోసం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ హౌస్ అంతటనీ అల్లాడించేసింది. ఎవరి నోటి వెంటైనా చిన్న మాట వస్తే చాలు.. దానిని పట్టుకుని రచ్చ రచ్చ చేస్తోంది.

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) గత వారం అంతా చప్పగా సాగింది. ఈ వారం అంతా సంజనాయే ఉండేలా ఉంది. ఆమెను బిగ్‌బాస్ (Biggboss) దొంగతనాలు చేయిస్తే పోయేదేమో అని ఇవాళ (సోమవారం) ప్రోమోలు (Biggboss Promo), లైవ్ చూసిన వారెవరికైనా అనిపిస్తుంది. పొద్దస్తమానం కంటెంట్ ఇవ్వడం కోసమే దొంగతనాలు చేసే సంజన.. ఇకమీదట దొంగతనం చేస్తే మెడలో బోర్డు వేస్తామని చెప్పడంతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక కంటెంట్ ఇవ్వాలంటే ఏం చేయాలి? అందుకోసమే.. ప్రతి చిన్న దానికి నానా రాద్దాంతాం చేసి కెమెరాలను తన చుట్టూ తిప్పుకుంటోంది. ఇవాళ సంజన (Sanjana) తన ఫుడ్ కోసం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ హౌస్ (Biggboss House) అంతటనీ అల్లాడించేసింది. ఎవరి నోటి వెంటైనా చిన్న మాట వస్తే చాలు.. దానిని పట్టుకుని రచ్చ రచ్చ చేస్తోంది. తనను బతకనివ్వండంటూ పెద్ద పెద్ద మాటలు వాడేస్తోంది.
తనకు ఫుడ్ పోపు వేసి ఇవ్వమని అడిగింది. దానికి దివ్య నికిత (Divya Nikitha) చూసుకుని చేస్తామని చెప్పింది. అంతే రాద్దాంతం స్టార్ట్. మధ్యలో తనూజ అసలు మనం కిచెన్‌లోకి వెళ్లకూడదు. మీరెందుకు వెళ్లారని అడిగింది. ఇక అంతే.. సంజన చంద్రముఖి (Chandrbmukhi)గా మారిపోయి ఏడుస్తూ కావల్సినంత డ్రామా ప్లే చేసింది. ఈమెకు తానా అంటే తందానా అంటూ ఒకవైపు ఇమ్మాన్యుయేల్ (Emmanuel).. మరోవైపు ఫ్లోరా షైనీ (Flora shaini) చేరిపోయారు. మధ్యలో తనూజ (Tanuja) మీరు ఏది అడిగితే అది చేసిస్తూనే ఉన్నాం కదా.. మొన్న మీరు స్వీట్ దోశ అడిగితే చేసిచ్చాం. అది మీరు అందరికీ పెట్టారు కూడా అన్నది. ఇక అంతే ఒక స్పూన్ షుగర్ ఇచ్చినందుకు ఇంత రాద్దాంతం చేస్తారా? అంటూ ఎంత హంగామా చేయాలో అంతా చేసింది. భరణి (Bharani), డెమాన్ పవన్ (Demon Pawan) ఎంత చెబుతున్నా వినే పరిస్తితి లేదు. కావాలని చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు వింటుంది? ఇకపై ఊపిరి తీసుకోవాలన్నా మీ పర్మిషన్‌తోనే చేయాలా.. నన్ను బతకనివ్వరా? అంటూ సంజన చేసిన గొడవ చూస్తే విసుగు చెందడం ఖాయం.
వైల్డ్ కార్డ్స్ వచ్చేసి తమకు సంజన (Biggboss Sanjana) అంటే ఇష్టమని చెప్పడం.. అలాగే దివ్య నికిత (Divya Nikitha) ఆమెను మూడో స్థానంలో పెట్టడంతో ఆమె చేసిందే కరెక్ట్ అన్న ఆలోచనలో ఉంది. ఫుటేజ్ ఇవ్వడం కోసం తనకు తోచిన విధంగా చేసుకుంటూ పోతోంది. పైగా హోస్ట్ నాగార్జున (Host Nagarjuna) వచ్చి కూడా ఆమెకు బూస్ట్ ఇస్తున్నట్టుగా మాట్లాడటం.. ఆమెనే సీక్రెట్ రూం (Biggboss Secret Room)కి పంపించడం వంటివి చూసిన తర్వాత ఇక తన ఇచ్చే కంటెంట్ కారణంగానే తను టాప్ పొజిషన్‌లో ఉన్నానన్న భ్రమలో ఏదేదో చేసుకుంటూ వెళ్లిపోతోంది. ఇలాగే ఉంటే ఆమె త్వరలోనే బయటకు రావడం ఖాయం. ఈవారం నాగార్జున (Nagarjuna) అయినా ఆమెను కంట్రోల్ చేయాలి. లేదంటే షో మొత్తం తనే కనిపించేందుకు ఇలాంటివి ఆమె చాలా చేస్తుందనడంలో సందేహమే లేదు. పైగా ప్రేక్షకులకు సైతం ఆమె వైఖరి విసుగొస్తుంది. ఇక అంతే ఆ తరువాత ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా..
ప్రజావాణి చీదిరాల