ఇంత సీక్రెసీ ఎందుకో..!
ఆతిథ్యం మొదలు ఆహారం వరకూ అంటే.. ఇంటర్ కాంటినెంటల్ హోటల్, ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమరీతో పాటు ఎన్నో రకాల బిజినెస్‌లు ఉన్నాయి.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. తన కోడలిగా సచిన్.. ముంబై (Mumbai)కి చెందిన సానియా చందోక్ (Sania Chandok)ను ఎంచుకున్నట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినవస్తున్నాయి. ఇప్పటికే అర్జున్, సానియాల నిశ్చితార్థం (Engagement) కూడా జరిగింది. కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక జరిగినట్టు సోషల్ మీడియా (Social Media) టాక్. దీనిపై ఇరు కుటుంబాల నుంచి ఎలాంటి ప్రకటనా లేదు కానీ అర్జున్, సానియాల వివాహం గురించి ప్రచారమైతే గట్టిగానే జరుగుతోంది. మరి సచిన్ ఎందుకంత సీక్రెసీ మెయిన్‌టైన్ చేస్తున్నారో తెలియడం లేదు.
సానియా చందోక్ ఎవరు?
అర్జున్ టెండూల్కర్ వివాహం సానియా చందోక్‌తో జరగబోతోంది సరే.. కానీ ఎవరీ సానియా చందోక్. ఆషామాషీ అమ్మాయిని అయితే సచిన్ తన ఇంటికి కోడలిగా తెచ్చుకోరు కదా. మరి ఎవరై ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి అయితే అందరికీ ఉంటుంది కదా. సానియా చందోక్ మరెవరో కాదు.. ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ (Ravi Ghai) మనవరాలు. రవి ఘాయ్ కుటుంబానికి పలు రంగాల్లో వ్యాపారాలున్నాయి. ఆతిథ్యం మొదలు ఆహారం వరకూ అంటే.. ఇంటర్ కాంటినెంటల్ హోటల్, ప్రముఖ ఐస్‌క్రీమ్ బ్రాండ్ బ్రూక్లిన్ క్రీమరీతో పాటు ఎన్నో రకాల బిజినెస్‌లు ఉన్నాయి. ఇక‘మిస్టర్ పాస్ పెట్ స్పా& స్టోర్’ భాగస్వామిగా, డైరెక్టర్‌గా ఉన్న సానియా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఇక అర్జున్ టెండూల్కర్ విషయానికి వస్తే... ప్రస్తుతం క్రికెట్‌లో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అలాగే ఐపీఎల్ ముంబైకి సైతం ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ప్రజావాణి చీదిరాల