others

Biggboss9: రీతూ మోసం.. పవన్ వెన్నుపోటు.. విలవిల్లాడిపోయిన కల్యాణ్

పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)కి దారుణమైన మోసం అయితే జరిగింది. ఇది బిగ్‌బాస్ (Biggboss) నుంచో మరొకరి నుంచో కాదు.. తన క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న రీతూ చౌదరి (Rithu Chowdary), డెమాన్ పవన్ (Demon Pawan) నుంచి మోసం.

Biggboss9: రీతూ మోసం.. పవన్ వెన్నుపోటు.. విలవిల్లాడిపోయిన కల్యాణ్

బిగ్‌బాస్ సీజన్ 9 (Biggboss Season 9) రసవత్తరంగా మారుతోంది. బిగ్‌బాస్ హౌస్‌ (Biggboss House)లో ఇవాళ (శుక్రవారం) వచ్చిన ప్రోమో (Biggboss Promo) గూస్‌బంప్స్ అని చెప్పాలి. పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)కి దారుణమైన మోసం అయితే జరిగింది. ఇది బిగ్‌బాస్ (Biggboss) నుంచో మరొకరి నుంచో కాదు.. తన క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న రీతూ చౌదరి (Rithu Chowdary), డెమాన్ పవన్ (Demon Pawan) నుంచి మోసం. దీంతో ఒకరకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ గుండె పగిలినట్టుంది. దీనికంతటికీ కీ రోల్ రీతూ చౌదరి పోషించింది. కెప్టెన్సీ టాస్క్ (Biggboss Captaincy Task) నడిచింది. దీనిలో పవన్ కల్యాణ్, ఇమ్మాన్యుయేల్ (Emmanuel) బీభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కానీ రీతూ కోరడం.. ఆ కోరికను మన్నిస్తూ డెమాన్ పవన్.. కల్యాణ్‌ని కెప్టెన్సీ టాస్క్ నుంచి తొలగించడం షాకిచ్చింది. ఇది దారుణమైన వెన్నుపోటు. చూసేవారికి మనసు కలుక్కుమనే ఘటన ఇది.

ఇటీవల ప్రతి ఒక్కరికి ఇంటి నుంచి ఏదో ఒక సందేశం వచ్చింది. పవన్, కల్యాణ్‌లకు రావు. కానీ పవన్ కోసం కల్యాణ్ త్యాగం చేశాడు. దీంతో డెమాన్ పవన్‌కి తన తండ్రి నుంచి ఆడియో సందేశం వచ్చింది. అలాంటి కల్యాణ్‌ని కెప్టెన్సీ టాస్క్‌లో పవన్, రీతూ కలిసి వెన్నుపోటు పొడవడం అనేది దారుణమైనది. కెప్టెన్సీ టాస్క్‌లో కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ, రామూ రాథోడ్ (Ramu Rathod) ఉన్నారు. వారికి బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్.. రెయిన్ డ్యాన్స్ (Rain Dance in Biggboss House). పోటీలో లేని వారు బజర్ మోగగానే ముందుగా ఎవరు బెల్ కొడతారో వారు రెయిన్ డ్యాన్స్ చేస్తుంటారు. మ్యూజిక్ స్టాప్ అయ్యేలోపు కంటెండర్స్ చెక్కపెట్టెను బ్లూ స్క్వేర్‌లో పెట్టాలి. ఒకవేళ అలా పెట్టలేకుంటే కంటెండర్స్‌లో ఒకరిని తొలగించాలి. అలా రీతూ చెప్పడంతో డెమాన్ పవన్ కల్యాణ్‌ని తొలగిస్తాడు.

తొలి రెండు ప్రోమోల్లోనూ రీతూ, పవన్, కల్యాణ్‌ల గురించే ఉంది. పవన్, రీతూ హగ్ చేసుకోవడం.. ఆ తరువాత శ్రీజ (Srija) వెళ్లి కల్యాణ్‌ని ఓదార్చడం వంటివి రెండో ప్రోమోలో ఉన్నాయి. తను ఈ హౌస్‌లో నమ్మింది పవన్, రీతూలనేనని కల్యాణ్ చెప్పాడు. ‘ఒకరి కష్టాన్ని దొబ్బడం కాదు ఎవడైనా సరే’ అని తెగేసి చెప్పాడు. తనను బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి తనను తీసేయమని చెప్పాలని ఎలా అనిపించింది? అంటూ రీతూని కల్యాణ్ నిలదీశాడు. డెమాన్‌ తన మాట వింటాడు కాబట్టి అతనితో ఏదైనా చేయించవచ్చని రీతూ భావించింది. పవన్ కూడా రీతూ చెప్పినట్టుగా చేసి తనను తాను దారుణంగా దిగజార్చుకున్నాడు. తనకు ఈ హౌస్‌లో ఉన్నది ఇద్దరేనని.. తను పవన్ నుంచి అలాంటిది ఊహించలేదని.. అది కూడా రీతూ తనను తీసేయమని చెప్పావు కదా అంటూ తన ఆవేదనను వెళ్లగక్కాడు.

వాస్తవానికి కల్యాణ్ అయితే మూడు రోజులుగా చాలా కష్టపడ్డాడు. కెప్టెన్సీ కోసం ప్రాణం పెట్టి ఆడాడు. అలాంటిది వేరే ఎవరైనా తనను కెప్టెన్సీ నుంచి తీసేసి ఉంటే పోనీలే అనుకునేవాడేమో. తన అనుకున్న వారే తనకు దెబ్బేయడం సహించలేకపోయాడు. ఇక పవన్ మరింత దిగజారి రీతూకి.. కల్యాణ్ చీదరించుకుంటూ ఉంటే అతని చుట్టు నువ్వు తిరగడం నచ్చలేదంటూ హితబోధ చేయడం మరింత దారుణం. ఆ తరువాత కూడా కల్యాణ్ దగ్గరకు వెళ్లి ‘నువ్వు బాధపడటం చూడలేకపోతున్నా.. నేను కూడా ఓడిపోయాను’ అని ఓదార్చే ప్రయత్నం చేసింది రీతూ. ‘నేను బాధపడేది ఓడిపోయినందుకు కాదు.. మోసపోయినందుకు’ అని కల్యాణ్ చెప్పాడు. అందరి ముందు పట్టుకుని నన్ను మోసం చేశా అంటున్నావని రీతూ రెచ్చిపోయింది. చెయ్యలేదా? అని నిలదీశాడు. మొత్తానికి కల్యాణ్ గ్రాఫ్ అయితే ఒక్కసారి లేచింది. పవన్, రీతూ గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. వాస్తవానికి పవన్ రీతూ మాట వినకుండా వేరొకరిని ఆట నుంచి తొలగిస్తే చాలా బాగుండేది. అద్భుతంగా ఆడిన కల్యాణ్‌ని తీసేయడం అనేది ఎవరికీ నచ్చడం లేదు.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 3, 2025 11:33 AM