Biggboss: అనుకున్న వ్యక్తిని కెప్టెన్‌ని చేసి టైట్ హగ్ ఇచ్చిన రీతూ.. మరీ ఇంత దారుణమా?
వాస్తవానికి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ నిన్నటి నుంచి టాస్కులు జరిగాయి. దీనిలో ఓనర్స్ గెలిచారు. దీంతో కెప్టెన్సీ కంటెండర్స్‌ని సెలక్ట్ చేసే బాధ్యత ఓనర్స్‌కే బిగ్‌బాస్ అప్పగించాడు.

బిగ్‌బాస్ సీజన్ 9 తెలుగు (Biggboss Season 9 Telugu) ఒకరకంగా చెప్పాలంటే.. బిగ్‌బాస్ (Biggboss) నిర్వాహకులకు కంటతడి ఒక్కటేనని చెప్పాలి. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలం (Commoners Vs Celebrities)టూ ఏదో చేయబోయిన నిర్వాహకులకు ఎందుకురా బాబు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాం అని అనిపిస్తున్నారు కామనర్స్. యథా రాజ తథా ప్రజ.. అన్నట్టుగా బిగ్‌బాస్ ఇస్తున్న టాస్కులు.. కామనర్స్ ఆడుతున్న గేమ్స్ దరిద్రంగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కెప్టెన్సీ టాస్క్ (Captaincy task) అయితే మరీ దారుణం. రంగు పడుద్ది పేరట కెప్టెన్సీ టాస్క్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు పెట్టారు. దీనికి రీతూ చౌదరి (Ritu Chowdary)ని సంచాలక్‌గా నియమించారు. వాస్తవానికి కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ నిన్నటి నుంచి టాస్కులు జరిగాయి. దీనిలో ఓనర్స్ గెలిచారు. దీంతో కెప్టెన్సీ కంటెండర్స్‌ని సెలక్ట్ చేసే బాధ్యత ఓనర్స్‌కే బిగ్‌బాస్ అప్పగించాడు.
అందరూ కలిసి ఏకాభిప్రాయంతో డీమాన్ పవన్ (Deeman Pawan), ఇమ్మాన్యుయేల్ (, Emmanuel), భరణి (Bharani), మర్యాద మనీష్ (Maryada Manish)ను ఎంపిక చేశారు. ట్విస్ట్ ఏంటంటే.. ‘నువ్వు కెప్టెన్ అవ్వాలి’ అంటూ డీమాన్ పవన్‌కి చెప్పిన రీతూ చౌదరికే సంచాలక్ బాధ్యతను బిగ్‌బాస్ అప్పగించారు. డీమాన్ పవన్‌ను కెప్టెన్ కావాలని అంత గట్టిగా కోరుకున్న రీతూవర్మను సంచాలక్‌గా నియమించడమంటే కెప్టెన్సీ బాధ్యతను తీసుకెళ్లి అతని చేతిలో పెట్టడమేగా? ఆమె ఒకరకంగా చేసిందదే. నలుగురూ రంగు పూసుకోవాలి.. బజర్ మోగాక ఎవరి టీ షర్ట్‌కు ఎక్కువ రంగు కనిపిస్తే వారు టాస్క్ నుంచి బయటకు వెళ్లాలి. అలా ఫస్ట్ మర్యాద మనీష్ బయటకు వెళ్లిపోయాడు. ఇక్కడి నుంచి రీతూ గేమ్ మొదలు పెట్టింది. బిగ్‌బాస్ బజర్‌తో సంబంధమే లేదు. తను స్టాప్ అంటే ఆగాలి. ఆగలేదో గేమ్ నుంచి తప్పుకోవాలట. మరి బజర్ ఎందుకో అర్థం కాలేదు.
తను చెప్పిన వెంటనే ఆపలేదని భరణిని గేమ్ నుంచి తప్పించేసింది. ఆ తరువాత ఇమ్మాన్యుయేల్‌ని తప్పించి పవన్‌ను కెప్టెన్‌ను చేసింది. చేసి చేయగానే వెళ్లి అతడిని హగ్ చేసుకున్న తీరు చూస్తున్న వారికి చిరాకు తెప్పిస్తుంది. అసలు తను అనుకున్న వ్యక్తిని కెప్టెన్‌ను చేస్తున్నా కూడా బిగ్‌బాస్ పట్టనట్టు వ్యవహరించడం ఆసక్తికరం. మొత్తానికి బిగ్‌బాస్ అయితే అనుకున్నది సాధించినట్టుగా తెలుస్తోంది. రీతూ చౌదరిని సంచాలక్‌గా వ్యూహాత్మకంగానే నియమించారని తెలుస్తోంది. ఇక కామనర్స్ వ్యవహరిస్తున్న తీరు అయితే దారుణం. వాళ్ల మాటలు, వాళ్ల వ్యవహార శైలి అయితే చూసేవారికి జుగుప్స కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా శ్రీజ, ప్రియ వ్యవహార శైలి దారుణమనే చెప్పాలి.