Modi Government: సామాన్యుడిపై కాస్త కరుణ చూపిన మోదీ సర్కార్.. దిగి వచ్చిన నిత్యావసరాల ధరలు
మొత్తానికి జనాలపై మోదీ సర్కార్ ఇంత కాలానికి కాస్త కరుణ చూపింది. జీఎస్‌టీ సంస్కరణలు నిన్నటి (సోమవారం) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే నిత్యావసరాల ధరల నుంచి..

మొత్తానికి జనాలపై మోదీ సర్కార్ (Modi Government) ఇంత కాలానికి కాస్త కరుణ చూపింది. జీఎస్‌టీ సంస్కరణలు (GST Reforms) నిన్నటి (సోమవారం) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలోనే నిత్యావసరాల ధరల నుంచి కొన్ని లగ్జరీ వస్తువుల ధరల (Prices of luxury goods) వరకూ పన్నుల (Taxes) భారం తగ్గింది. వేటిపై ఎంత మేర తగ్గనుందంటే.. కిరాణా సరుకులపై 13 శాతం కుటుంబ ఖర్చులు తగ్గనున్నాయి. లగ్జరీ వస్తువుల ధరలు పెరిగినా.. తగ్గినా సామాన్యుడికి పెద్దగా ఒరిగేదేమీ లేదు కానీ కిరాణా సరుకుల ధరలు (Grocery prices) తగ్గడంతో మాత్రం సామాన్యుడికి పెను భారం తగ్గినట్టే. ఇక స్టేషనరీ (Stationery), దుస్తులు (Clothes), పాదరక్షలు (Footwear), ఔషధాల (medicines)పై కూడ ఖర్చులు 7-12 శాతం.. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీల (Life insurance policies)పై ఉన్న 18% పన్నును తొలగించడంతో ఈ మేరకు ఆదా కానుంది. మొత్తంగా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 375 రకాల వస్తువులపై జీఎస్‌టీ రేట్లు (GST Rates) తగ్గాయి.
ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్స్ (Electronics, వాహన షోరూం (Vehicle Show Rooms)ల వద్ద ధరల తగ్గింపునకు సంబంధించిన బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా కార్ల విషయానికి వస్తే చిన్న కార్లపై రూ.70 వేల వరకూ ధరలు తగ్గాయి. ఇక ట్రాక్టర్లపై కూడా జీఎస్టీ 5 శాతం తగ్గాయి. దీంతో కొనుగోలుదారులకు రూ.40 వేల వరకూ ఆదా కానుంది. బైకులు (Bikes), స్కూటర్లు (Scooters), పెద్ద టీవీ (TV)లు, ఏసీ (AC)లపై కూడా కొంత మేర ధరలు తగ్గాయి. అవి చెప్పుకోదగిన స్థాయిలో లేవని చెప్పాలి. హోండా కార్ల ధరలు దాదాపు లక్ష రూపాయలపైనే తగ్గాయి. అంటే మొత్తం తమ వాహన శ్రేణిపై ధరలను రూ.65,000- 1,20,000 మేర తగ్గించినట్లు హోండా కార్ల ఇండియా తెలిపింది. ముఖ్యంగా హోండా అమేజ్ (Honda Amaze) అయితే రూ.10 లక్షలకు దిగి వచ్చింది. సెకండ్ జనరేషన్ అమేజ్ ఎస్ఎంటీ వేరియట్‌పై రూ.65,100.. థర్డ్ జనరేషన్ జెడ్ఎక్స్ సీవీటీ ధర రూ.1.2 లక్షల వరకూ తగ్గింది. అయితే 350సీసీ లోపు టూ వీలర్స్‌పై పెద్దగా చెప్పుకోదగిన స్థాయిలో రేట్లు తగ్గకపోయినా.. ఎంతో కొంత అయితే తగ్గింది. 350సీసీ పైన ఉండే టూ వీలర్స్‌పై జీఎస్‌టీ రేట్లు 28% నుంచి 40 శాతానికి పెంచారు.