others

Cigarette: సిగిరెట్ ధరల ప్రకటనతో ఐటీసీ షేర్లు ఢమాల్..

తాజాగా ఐటీసీ షేర్ల విషయంలో అదే జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ (Ministry of Finance) ఫిబ్రవరి 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం (Excise Duty) విధించనున్నట్లు నోటిఫికేషన్ అలా జారీ చేసిందో లేదో.. ఐటీసీ షేర్లు ఢమాల్..

Cigarette: సిగిరెట్ ధరల ప్రకటనతో ఐటీసీ షేర్లు ఢమాల్..

ఏదైనా సంస్థకు సంబంధించి ఒకే ఒక్క ప్రకటన చాలు.. సంస్థ షేర్లను పెంచడానికైనా.. ముంచడానికైనా.. తాజాగా ఐటీసీ షేర్ల విషయంలో అదే జరిగింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ (Ministry of Finance) ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం (Excise duty) విధించనున్నట్లు నోటిఫికేషన్ అలా జారీ చేసిందో లేదో.. ఇలా ఐటీసీ షేర్లు (ITC Shares) కుప్పకూలాయి. దాదాపు 10శాతం పడిపోయాయి. బీఎస్‌ఈ (BSE)లో నిన్న (గురువారం) గరిష్ట స్థాయి అయిన రూ. 402.30 నుంచి దాదాపు 10% పడిపోయి, రోజు కనిష్ట స్థాయి అయిన రూ. 362.70కి చేరుకున్నాయి.

బుధవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ, సిగరెట్ (Cigarette) పొడవును బట్టి, ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా ఎక్సైజ్ సుంకాన్ని పెంచనున్నట్టు వెల్లడించింది. ప్రతి 1,000 సిగరెట్లపై రూ. 2,050 నుంచి రూ. 8,500 వరకు ఎక్సైజ్ సుంకాన్ని నోటిఫై చేసింది. సెప్టెంబర్ 2025 త్రైమాసికం నాటికి బీఎస్‌ఈలో ఐటీసీ వాటాదారుల (ITC Shareholders) నమూనా ప్రకారం, కంపెనీలోని మొత్తం 100% వాటాను పబ్లిక్ షేర్ హోల్డర్స్ కలిగి ఉన్నారు. దీనికి సంబంధించి ప్రమోటర్ లేదా ప్రమోటర్ గ్రూప్ వాటా అంటూ లేకపోవడం గమనార్హం. ఏస్ఎంఎఫ్ (SMF) ప్రకారం, నవంబర్ 2025 నాటికి మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) రూ. 78,952.33 కోట్ల మార్కెట్ విలువ కలిగిన 195 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి.

ఆల్టివా ఎస్ఐఎఫ్ సహా సుమారు 48 ఏఎంసీలు తమ పోర్ట్‌ఫోలియోలలో ఈ స్టాక్‌ను యాడ్ చేసుకున్నాయి. నవంబర్ 28, 2025 నాటికి, ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ అత్యధికంగా సుమారు 41.15 కోట్ల షేర్లను కలిగి ఉండగా.. వాటి మార్కెట్ విలువ రూ. 16,638 కోట్లు. ఇక ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ (ICICI Prudential Mutual Fund), నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ (Nippon India Mutual Fund) వరుసగా 33.71 కోట్లు, 18.02 కోట్ల షేర్లను కలిగి ఉన్నాయి. పీపీఎఫ్ఏఎస్ మ్యూచువల్ ఫండ్ (PPFASMutualFund) తన పోర్ట్‌ఫోలియోలో రూ. 6,290 కోట్ల విలువైన 15.55 కోట్ల ఐటీసీ షేర్లను కలిగి ఉంది. గత రెండు సంవత్సరాలుగా, ఐటీసీ షేర్లు 17.66% క్షీణించాయి. గత సంవత్సరంలో అవి 20.50% పడిపోయాయి.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 2, 2026 4:35 AM