others

Viral News: ఇక చచ్చినా చావరట..

టైటిల్ చూసి అమృతం ఏమైనా తయారు చేస్తున్నారా? అని భావించవచ్చు. అమృతాన్ని సాధించేందుకు సాగర మథనం వంటి కార్యక్రమాలేమీ పెట్టుకోవడం లేదు కానీ వైద్యులు మాత్రం మృత శరీరంలోని..

Viral News: ఇక చచ్చినా చావరట..

టైటిల్ చూసి అమృతం ఏమైనా తయారు చేస్తున్నారా? అని భావించవచ్చు. అమృతాన్ని సాధించేందుకు సాగర మథనం వంటి కార్యక్రమాలేమీ పెట్టుకోవడం లేదు కానీ వైద్యులు మాత్రం మృత శరీరంలోని కణజాలానికి జీవాన్ని అందించేందుకు మాత్రం కంకణం కట్టుకున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను తమ వద్దే భద్రపరిచి తిరిగి జీవం పోసేందుకు శ్రమిస్తున్నారు. అందుకేనండీ.. ఇక మనం చచ్చినా చావం.

మళ్లీ బతకాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఆ మాటకొస్తే చనిపోవాలని ఎవరికి ఉంటుంది? కానీ చనిపోయినవారిని మాత్రం తిరిగి బతికించేందుకు యత్నం అయితే జరుగుతోంది. ఈ క్రమంలోనే మృతదేహన్ని (Dead Body) సురక్షితమై వాతావరణంలో నిపుణులు భద్రపరుస్తారు. ఈ ప్రక్రియను క్రయోనిక్స్‌ (Cryonics)గా పిలుస్తారు. క్రయోనిక్స్ అనేది గ్రీకు భాషా పదం. క్రయో అంటే శీతలం.. మొత్తంగా క్రయోనిక్స్ అంటే శీతల వాతావరణంలో భద్రపరచడం. వాస్తవానికి 50 ఏళ్ల క్రితమే ఈ క్రయోనిక్స్ కంపెనీని ప్రారంభించారు. అమెరికాకు చెందిన రాబర్ట్ ఎటింగర్ అనే ఫిజిక్స్ ప్రొఫెసర్ దీనిని ప్రారంభించారు. రాబర్ట్ ఎటింగర్ తల్లితో పాటు ఇద్దరు భార్యల మృతదేహాలు దీనిలోనే భద్రంగా ఉన్నాయి. 92 ఏళ్ల వయసులో రాబర్ట్ కూడా మరణించి వారికి తోడయ్యారు.

బతికే అవకాశం లేదనుకున్న సమయంలో..

ఏమైనా అనారోగ్య పరిస్థితితో ఆసుపత్రిలో చేరి ఇక బతికే అవకాశం లేదు అనుకున్న సమయంలో క్రయోనిక్స్ నిపుణులకు చెబితే అన్ని ఏర్పాట్లు చేస్తారు. వ్యక్తి మరణించిన మరుక్షణమే ‘క్రయోప్రిజర్వేషన్‌ (Cryopreservation)’ ప్రారంభమవుతుంది. వైద్య నిపుణులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కృత్రిమ పద్ధతుల్లో రక్త ప్రసరణతో పాటు శ్వాసను పునరుద్ధరించి బ్లడ్ థిన్నర్స్ ఎక్కించి ద్వారా మెదడును భద్రపరుస్తారు. ఇక శరీరాన్ని అతి శీతల వాతావరణంలో భద్రపరచడం వలన శరీరం పూర్తిగా గడ్డకట్టుకు పోతుంది. కాబట్టి ఈ క్రయోనిక్స్ పద్ధతిలో ముందుగా వ్యక్తి శరీరంలోని ద్రవ పదార్థాలను బయటకు తీసి వాటి స్థానంలో ‘క్రయోప్రొటెక్టివ్‌ ఏజెంట్స్‌’ నింపుతారు. దీనివల్ల శరీరం ఎంత శీతల వాతావరణంలో భద్రపరిచినా కూడా గడ్డకట్టుకుపోవడం అనేది ఉండదు. దీన్నే ‘విట్రిఫికేషన్‌’ అంటారు. ఆ తరువా శరీరాన్ని క్రమంగా చల్లబరిచి లిక్విడ్ నైట్రోజన్ నింపిన ఫ్రీజర్‌లో భద్రపరుస్తారు. సూక్ష్మజీవులు శరీరాన్ని నాశనం చేయకుండా ఇది కాపాడుతుంది. వైద్యశాస్త్రం జనన మరణాల కోడ్‌ను కనిపెట్టే వరకూ ఈ యథాతథ స్థితి కొనసాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ కోసం రూ. 2 కోట్ల వరకూ ఖర్చవుతుందట.

మనుషులనే కాదు..

ఈ పద్ధతిలో మనుషులనే కాదండోయ్.. పెంపుడు జంతువుల (Pets)ను సైతం బతికిస్తారట. పెంపుడు జంతువులను బతికించుకునేందుకు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడని వారున్నారు. వారు సైతం ఈ పద్ధతిని ఉపయోగించి వాటిని బతికించుకోవచ్చట. దీనికోసం యానిమల్ క్రయోనిక్స్ సైతం వెలుస్తున్నాయి. మొత్తానికి, 2050 నాటికి శాస్త్రవేత్తలు చావు రహస్యాన్ని కనిపెడతారట. అయితే చనిపోయిన వారు తిరిగి బతికిన తర్వాత ఎప్పటికీ జీవించే ఉంటారా? తిరిగి వారి జీవిత కాలం ఎంత? వంటి అంశాలలో మాత్రం స్పష్టత లేదు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 7, 2025 6:20 AM