Biggboss 9: ఇమ్మూ తక్కువోడేం కాదు.. కరెక్ట్‌గా గెస్ కొట్టాడు.. కెప్టెన్సీ పట్టాడు..
దివ్య నికితకు ఆర్గ్యూ స్కిల్స్ గట్టిగానే ఉన్నాయి. అసలు వైల్డ్ కార్డ్స్‌గా నలుగురు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే కామనర్స్‌లో కొందరి ప్రవర్తన మారిపోయింది.

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu).. ఈ వారమంతా చూసేవారికి తలనొప్పి తెప్పించే మాదిరిగానే ఉంది. కనీసం ఓ టాస్క్‌లు లేవు.. ఏమీ లేవు. చివరకు కెప్టెన్సీ టాస్క్ (Captaincy Task) పెట్టినా కూడా అది కూడా చప్పగానే సాగింది. మొత్తానికి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే జరిగింది. వైల్డ్ కార్డ్ ద్వారా కామనర్‌గా దివ్య నికిత (Divya Nikitha) ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి ఈమెకు ఆర్గ్యూ స్కిల్స్ గట్టిగానే ఉన్నాయి. అసలు వైల్డ్ కార్డ్స్‌గా నలుగురు హౌస్ (Biggboss House)లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచే కామనర్స్‌లో కొందరి ప్రవర్తన మారిపోయింది. బయట ఏం జరుగుతుందనేది చాలా వరకూ అర్థం చేసుకున్నట్టుగానే కనిపిస్తున్నారు. ముఖ్యంగా శ్రీజ (Srija), ప్రియ (Priya) అయితే చాలా వరకూ తగ్గినట్టుగా కనిపిస్తున్నారు. మాటలు విసరడం చాలా వరకూ తగ్గించేశారు. కానీ ప్రియకు అయితే ఇప్పటికే ఆలస్యమైందని చెప్పాలి.
ఇక కామనర్స్ (Biggboss Commoners) మాట్లాడినదాన్ని బట్టి ఇమ్మాన్యుయేల్ (Immanuel) బాగానే గెస్ చేశాడు. బయట ఏం అనుకుంటున్నారో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కామనర్స్ అదే చెప్పారని చెప్పాడు. ఇక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన దివ్య నికితను కంటెస్టెంట్స్ అందరికీ ర్యాంకింగ్స్ ఇవ్వమన్నారు. దాదాపుగా కామనర్స్ అందరినీ ఒక్క కల్యాణ్ (Kalyan)ను తప్ప 5 పైనే నిలబెట్టేసింది. భరణి (Bharani)ని 1లో.. ఇమ్మాన్యుయేల్‌ని 2లో.. సంజనా (Sanjana Garlani)ని 3లో.. కల్యాణ్‌ని 5లో.. తనూజ (Tanuja)ని 5లో నిలబెట్టింది. ఈ ఐదుగురు మాత్రమే కెప్టెన్సీ టాస్క్‌కు అర్హులని బిగ్‌బాస్ చెప్పారు. ఇక తప్పిస్తారా.. గెలిపిస్తారా? అనే గేమ్‌ను కెప్టెన్సీ టాస్క్‌గా బిగ్‌బాస్ పెట్టారు. ఈ గేమ్‌లో ఫైనల్‌గా భరణికి.. ఇమ్మూకి పడింది. చివరికి ఇమ్మాన్యుయేల్ గెలిచి బిగ్‌బాస్ కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది.
ప్రజావాణి చీదిరాల